గత కొంతకాలంగా సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు వ్యాయామం చేస్తూ, డ్యాన్స్ చేస్తూ ఇలా రకరకాల కారణాలతో హఠాత్తుగా మరణిస్తున్నారు. ముఖ్యంగా గత మూడేళ్ళ నుంచి ఇటువంటి ఘటనలు సంబంధించిన వార్తలు అధికంగా వింటున్నాం.. వయసుతో సంబంధం లేకుండా మృత్యువాత పడి తమ కుటుంబ సభ్యులను తీరని విషాదంలో నెట్టేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి.. జిమ్‌లో వ్యాయామం చేస్తూ.. గుండెపోటుతో మరణించాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే..
ఇండోర్‌లోని జిమ్‌లో వ్యాయామం చేస్తున్న వ్యక్తికి గుండెపోటు వచ్చిన షాకింగ్ వీడియో ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఓ హోటల్ యజమాని వర్కవుట్ చేస్తుండగా గాలి పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతూ.. నేలపై కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు,.. అయితే వైద్య సిబ్బంది అతను చనిపోయినట్లు ప్రకటించారు.
వీడియో వైరల్
जिम में एक और मौत।
इंदौर: होटल व्यापारी की वर्क आउट करने के दौरान दिल का दौरा पड़ा और देखते ही देखते उनकी मौत हो गई। #Indore #Gym #heartattack pic.twitter.com/3ON7v2vPKi
— Afroz Alam (@AfrozJournalist) January 5, 2023
ట్రెడ్‌మిల్‌ని ఉపయోగించిన తర్వాత అతనికి చెమటలు పట్టినట్లు వీడియోలో కనిపించింది. అతను తన జాకెట్ తీసి రిలాక్స్ అవ్వడానికి ప్రయాణిస్తున్నాడు.. మరోవైపు తనకు మద్దతు కోసం పక్కనే ఉన్న టేబుల్‌పై వాలడానికి ప్రయత్నించాడు.. అయితే హఠాత్తుగా నేలపై పడిపోయాడు. అక్కడ వ్యాయామం చేస్తున్న కొందరు యువకులు వెంటనే స్పందించి.. పక్కనే ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆ వ్యక్తి మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు.
మృతుడు హోటల్ బృందావన్ యజమాని ప్రదీప్ రఘువంశీ (55) అని.. గోల్డ్ జిమ్ లో ట్రెడ్‌మిల్‌తో వ్యాయామం చేస్తూ గుండెపోటుకు గురయ్యాడని పోలీసులు చెప్పారు. అతను ప్రతిరోజూ రెండు గంటలు జిమ్‌లో వ్యాయామం చేసేవాడని పేర్కొన్నారు. అయితే రఘువంశీ కొడుకు పెళ్లి త్వరలో జరగనుందని సన్నిహితులు చెప్పారు. పెళ్లిజరగాల్సిన ఇంట్లో మరణం సంభవించడంతో తీవ్ర విషాదం నెలకొంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ సన్నిహితుల్లో రఘువంశీ ఒకరు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..