Floating Stone: నదిలో తేలుతూ వచ్చిన అరుదైన రాయి.. పూజలు చేస్తున్న స్థానిక ప్రజలు.. వీడియో వైరల్

|

Aug 02, 2022 | 4:22 PM

రాయి నదిలో ఈత కొడుతున్నట్లు.. తేలుతూ.. ఉండడం విశేషం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే ఆ రాయి పై రామ అని రాసిఉంది. అందుకే ఆ రాయి నీటిలో మునిగిపోకుండా తేలి ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

Floating Stone: నదిలో తేలుతూ వచ్చిన అరుదైన రాయి.. పూజలు చేస్తున్న స్థానిక ప్రజలు.. వీడియో వైరల్
Floating' Stone Found In Up
Follow us on

Floating Stone: భారత దేశం ఆధ్యాత్మికతకు నెలవు. అనేక వింతలు, రహస్యాలు నేటికీ సైన్స్ కు సవాల్ విసురుతూనే ఉన్నాయి. వాటిల్లో ఒకటి రామ సేతు వారథి. రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళి..లంకలో దాచాడు. దీంతో రాముడు తన భార్య సీత కోసం లంకకు వెళ్లడానికి తన సైన్యం తో నిర్మించిన వారధి.. రామ సేతు. రామేశ్వరం వద్ద  సముద్రం పై వారథి నిర్మించే సమయంలో రాళ్ళు నీటిలో మునిగిపోయేవట. లంకకు వెళ్లడానికి రాముడు వానర సైన్యంతో సముద్రం పై ఇక్కడ రామ సేతు నిర్మాణం చేపట్టాడు.. అప్పుడు వంతెన కోసం రాళ్ళు వేస్తుంటే.. నీటిలో మునిగిపోయేవట. అప్పుడు వానర సైన్యం ఆ రాళ్ళపై శ్రీరామ అని రాశారట. అందుకే ఆ రాళ్ళు మునిగిపోవడం లేదని కొంతమంది చెబుతారు. తాజాగా నదిలో తేలుతున్న రాయి ఒకటి వార్తల్లో నిలిచింది.

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లా లోని ఇసాన్ నదిలో ఓ రాయి ఒకటి కొట్టుకొచ్చింది.  అయితే ఆ రాయి నదిలో ఈత కొడుతున్నట్లు.. తేలుతూ.. ఉండడం విశేషం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే ఆ రాయి పై రామ అని రాసిఉంది. అందుకే ఆ రాయి నీటిలో మునిగిపోకుండా తేలి ఉందని అంటున్నారు. ఈ రాయి దాదాపు 6 కిలోల బరువు ఉన్నట్లుగా నిర్ధారించారు. నీటిలో తేలియాడే ఈ రాయిని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. అంతేకాదు.. ఈ రాయిని రాముడు..  రావణుడిపై యుద్ధం కోసం వెళ్లే సమయంలో నల నీలులు నిర్మించిన రామసేతు వంతెనకు చెందిన రాయిగా ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ రాయిని ఆలయంలో ఉంచి స్థానికులు పూజలు జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇసాన్ నది థానా బేవార్ ప్రాంతంలోని అహ్మల్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జులై 30వ తేదీ ఉదయం గ్రామానికి చెందిన కొందరు చిన్న పిల్లలు నదిలో చేపలు పట్టుకుంటునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో నది ఒడ్డున ఓ నల్లరాయి తేలుతూ కనిపించింది. పిల్లలు నది నుండి రాయిని బయటకు తీశారు, దానిపై రామ అని వ్రాసి ఉంది. దాంతో ఈ రాయిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాలనుంచి జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..