Watch Video: సర్కార్ బడిలో షాకింగ్‌ సీన్‌.. సిగపట్లుపట్టి నేలపైదొర్లుతూ కొట్టుకున్న టీచర్‌, అంగన్‌వాడీ వర్కర్‌! వీడియో

ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్‌, అంగన్‌వాడీ కార్యకర్త మధ్య మార్చి 26న వాగ్వాదం జరిగింది. ఇది వారిద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది. అంతే అది పాఠశాల అని, పిల్లలందరూ చూస్తున్నారన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఇంద్దరూ సిగపట్లు పట్టి తన్నుకోవడం ప్రారంభించారు. కాసేపటికి నేలపై పడి దొర్లుతూ దారుణంగా కొట్టుకున్నారు..

Watch Video: సర్కార్ బడిలో షాకింగ్‌ సీన్‌.. సిగపట్లుపట్టి నేలపైదొర్లుతూ కొట్టుకున్న టీచర్‌, అంగన్‌వాడీ వర్కర్‌! వీడియో
School Teacher And Anganwadi Worker Fight

Updated on: Mar 30, 2025 | 11:02 AM

లక్నో, మార్చి 30: ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తించి, పిల్లలను తీర్చిదిద్దవల్సిన ప్రభుత్వ స్కూల్‌లోని టీచర్‌ వీధి రౌడీలా ప్రవర్తించింది. పిల్లలందరూ చూస్తుండగా అంగన్‌వాడీ వర్కర్‌తో ముష్టి యుద్ధానికి దిగింది. ఇద్దరూ సిగపట్లు పట్టి కింద పడి దొర్లిదొర్లి కొట్టుకున్నారు. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రీతి తివారీ, అంగన్‌వాడీ కార్యకర్త చంద్రావతి మధ్య మార్చి 26న వాగ్వాదం జరిగింది. ఇది వారిద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది. అంతే అది పాఠశాల అని, పిల్లలందరూ చూస్తున్నారన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఇంద్దరూ సిగపట్లు పట్టి తన్నుకోవడం ప్రారంభించారు. కాసేపటికి నేలపై పడి దొర్లుతూ కాళ్లతో తన్నుకుంటూ కొట్టుకున్నారు. చుట్టూ కొలాహలంగా చూస్తున్న విద్యార్ధులు తమ టీచర్‌ను కొడుతున్న అంగన్వాడీ కార్యకర్త చంద్రావతిని కాళ్లతో కొట్టసాగారు. చివరికి స్కూల్‌ సిబ్బంది వారిని విడిపించారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనలో అంగన్‌వాడీ కార్యకర్త చంద్రావతి తీవ్రంగా గాయపడగా.. ఆమెను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక స్కూల్‌ టీచర్‌ ప్రీతి తివారీ ఇటీవల జౌన్‌పూర్ నుంచి అక్కడికి బదిలీ అయింది. బుధవారం అంగన్వాడీ కార్యకర్తతో వాగ్వాదం జరగడంతో ఘర్షణ చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో విద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఈ సంఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కైలాష్ శుక్లాను కోరారు. ఆదేశించారు. అయితే టీచర్ ప్రీతి తివారీ గతంలో కూడా కొందరితో ఘర్షణ పడినట్లు స్కూల్‌ సిబ్బంది ఆరోపించారు.

టీచర్ ప్రీతి తివారీ గొడవను ప్రారంభించిందని, అంగన్‌వాడీ కార్యకర్త చంద్రవతిపై మొదట దాడి చేసిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రీతి తివారీ వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదని, ఆమెపై గతంలో ఇలాంటి ఫిర్యాదులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించి తమకు ఇంకా ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఎవరైనా ఫిర్యాదు నమోదు చేస్తే, అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.