రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్‌కి ఫిట్స్.. 9 వాహనాల్ని ఢీకొట్టుకుంటూ వెళ్లిన బస్సు

సోమవారం నాడు ఒక బస్సు డ్రైవర్‌కి ఫిట్స్ రావడంతో నియంత్రణ కోల్పోయి, 9 వాహనాలను ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని తెలిసింది. వెంటనే స్పందించిన మరో వ్యక్తి డ్రైవర్ సీటు వద్దకు వెళ్లి బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బస్సులోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్‌కి ఫిట్స్.. 9 వాహనాల్ని ఢీకొట్టుకుంటూ వెళ్లిన బస్సు
Bengaluru Bus Accident

Updated on: Oct 13, 2025 | 11:39 AM

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సు అదుపు తప్పి తొమ్మిది వాహనాలను ఢీకొట్టింది. దీంతో మూడు ఆటోరిక్షాలు, మూడు కార్లు, అనేక బైక్‌లు ధ్వంసమయ్యాయి. సోమవారం నాడు ఒక బస్సు డ్రైవర్‌కి ఫిట్స్ రావడంతో నియంత్రణ కోల్పోయి, 9 వాహనాలను ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని తెలిసింది. వెంటనే స్పందించిన మరో వ్యక్తి డ్రైవర్ సీటు వద్దకు వెళ్లి బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బస్సులోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

డ్రైవర్‌ బస్సు నడుపుతుండగానే అకస్మాత్తుగా అతనికి మూర్ఛ రావడంతో పక్కకు ఒరిగిపోయాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు యాక్సిలరేటర్ నొక్కినప్పుడు ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. వేగంగా వెళ్తున్న బస్సు ఆగిపోయే ముందు అనేక వాహనాలపైకి దూసుకెళ్లింది. ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు డ్రైవర్ మూర్ఛతో బాధపడుతున్నట్లు, వాహనంపై నియంత్రణ కోల్పోవడాన్ని సీసీటీవీ ఫుటేజ్‌లో చూడవచ్చు. బస్సును నియంత్రించడానికి కండక్టర్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ సకాలంలో ఆపలేకపోయాడు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

ప్రమాదంలో ఒక ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. కబ్బన్ పార్క్ ట్రాఫిక్ పోలీసులు బస్సు డ్రైవర్‌ను తదుపరి విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..