Watch Video: రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తిని చితకొట్టిన రైల్వే టీసీలు.. ముఖంపై బూటుకాలుతో..

టికెట్‌ లేకుండా రైల్లో ప్రయాణిస్తున్న ఓ ప్యాంసిజర్‌ను ఇద్దరు టీసీలు దారుణంగా కొట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో  ఆలస్యంగా..

Watch Video: రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తిని చితకొట్టిన రైల్వే టీసీలు.. ముఖంపై బూటుకాలుతో..
TC brutally thrash Passenger

Updated on: Jan 06, 2023 | 4:02 PM

టికెట్‌ లేకుండా రైల్లో ప్రయాణిస్తున్న ఓ ప్యాంసిజర్‌ను ఇద్దరు టీసీలు దారుణంగా కొట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో  ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ముంబై నుంచి జైనగర్ వెళ్తున్న రైలులో జనవరి 2 రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. టికెట్ల తనిఖీ కోసం వచ్చిన టీసీకి బాధితుడికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహావేశాలకు గురైన టీసీ పై బెర్త్‌లో కూర్చున్న ప్యాసింజర్‌ను కాలుపట్టుకుని కింది లాగే ప్రయత్నం చేయగా.. సదరు వ్యక్తి అడ్డుకునేందుకు ప్రయత్నించాడు.

ఈ క్రమంలో అదే ట్రైన్‌లో ఉన్న మరో టీసీ, అక్కడున్న టీసీతో కలిసి ఇద్దరూ బాదిత వ్యక్తిని కాలు పట్టుకుని కింది లాగారు. కింద పడ్డ ప్యాసింజర్‌ను దారుణంగా కొట్టారు. అతని ముఖంపై బూటు కాళ్లతో పదేపదే తన్నారు. తోటి ప్రయాణికులు కొట్టవద్దని వారిస్తున్న వినకుండా టీసీలు విచక్షణా రహితంగా కొట్టారు. ఈ మొత్తం ఘటనను అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన రైల్వే అధికారులు.. ప్రయాణికుడిపై దాడి చేసిన ఇద్దరు టీసీలను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. ప్రయాణికుడు టిక్కెట్ లేకుండా ప్రయాణించినందున వాదన ప్రారంభమైందని వివరణ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us