Viral Video: ప్రేమను తిరస్కరించిందని యువతిపై కాల్పులు జరిపిన నిందితుడు.. సీసీ కెమెరాలో రికార్డ్

|

Aug 18, 2022 | 10:49 AM

విద్యార్థిని కోచింగ్ నుండి తిరిగి వస్తున్న సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీలో కాల్పులు జరిగిన విషయం స్పష్టంగా కనిపిస్తోంది.

Viral Video: ప్రేమను తిరస్కరించిందని యువతిపై కాల్పులు జరిపిన నిందితుడు.. సీసీ కెమెరాలో రికార్డ్
Vegetable Vendors Daughter
Follow us on

Viral Video: బీహార్ రాజధానిలో సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. పాట్నాలో కూరగాయల వ్యాపారి కుమార్తెపై కాల్పులు జరిపినట్లు పోలీసులు  తెలిపారు. బీర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిపారాలోని ఇంద్రపురి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం జరిగిన కాల్పులు..  ప్రేమ వ్యవహారంతో ముడిపడి ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బాలిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. హృదయ విదారకమైన ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం దాడి చేసిన వ్యక్తి పరారీలో ఉన్నాడని.. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ దారుణ ఘటనకు కారణం ప్రేమ వ్యవహారం అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దారుణ ఘటన పాట్నాలోని బీర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిపారాలోని ఇంద్రపురి ప్రాంతంలో చోటు చేసుకుంది.

 

ఇవి కూడా చదవండి

విద్యార్థిని కోచింగ్ నుండి తిరిగి వస్తున్న సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీలో కాల్పులు జరిగిన విషయం స్పష్టంగా కనిపిస్తోంది. విద్యార్థి వచ్చే వరకు దాడి చేసిన వ్యక్తి వేచి ఉన్నాడు. విద్యార్థి తనను దాటి వెళ్లిన వెంటనే.. ఆమెను వెనుక నుండి కాల్చి వెంటనే పారిపోయాడు నిందితుడు. బాలిక మెడలో బుల్లెట్‌ ఇరుక్కుపోయింది. బాలిక వయసు 16 ఏళ్లు మాత్రమేనని చెబుతున్నారు.

ఈ ఘటన తర్వాత పలువురు మదిలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దాడి చేసిన వ్యక్తికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ని గంటలు గడుస్తున్నా పోలీసులు అతన్ని ఎందుకు పట్టుకోలేదు? అని అడుగుతున్నారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..