Nathu Singh: యావదాస్థిని ప్రభుత్వానికి రాసిచ్చేసిన 85 ఏళ్ల వృద్ధుడు.. ఈ నిర్ణయం వెనుక కారణం తెలిస్తే..

ఐదుగురు బిడ్డలకు తండ్రైన అతనికి అవసాన దశలో ఏ ఒక్కరూ అక్కరకు రాలేదు. తండ్రిని కాలానికి ఒదిలేసారు. దాంతో నాదూసింగ్‌ వృద్ధాశ్రమానికి చేరుకున్నాడు.

Nathu Singh: యావదాస్థిని ప్రభుత్వానికి రాసిచ్చేసిన 85 ఏళ్ల వృద్ధుడు.. ఈ నిర్ణయం వెనుక కారణం తెలిస్తే..
Nathu Singh has willed his land to the state government

Updated on: Mar 06, 2023 | 4:41 PM

ఆస్తులు, డబ్బులు, నగలు ఉంటే వాటికోసమైనా వృద్ధాప్య దశలో తమను పిల్లలు చూస్తారని నేటి తల్లిదండ్రులు భావిస్తున్నారు. అయితే ఆస్తులు కూడా ఏమీ చేయలేవని.. డబ్బుల కోసమైనా తల్లిదండ్రుల బాధ్యత తమది అనుకునే పిల్లలు రోజు రోజుకీ కరువు అవుతున్నారని తాజా ఘటనతో తెలుస్తోంది. అయితే ఆ తండ్రి.. సంచలన నిర్ణయం తీసుకున్నాడు.. బిడ్డకు జన్మనిచ్చి, పిల్లలే సర్వస్వంగా పెంచి పెద్దచేసి జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన పిల్లలకు సరైన గుణపాఠం చెప్పాడో తండ్రి.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన నాదూసింగ్‌కు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. అందరికీ వివాహాలు అయ్యాయి. ఎవరికి వారు చక్కగా సెటిల్‌ అయ్యారు. కాల క్రమంలో నాదూసింగ్‌ భార్య మృతి చెందగా ఆయన ఒంటరివాడయ్యాడు. ఐదుగురు బిడ్డలకు తండ్రైన అతనికి అవసాన దశలో ఏ ఒక్కరూ అక్కరకు రాలేదు. తండ్రిని కాలానికి ఒదిలేసారు. దాంతో నాదూసింగ్‌ వృద్ధాశ్రమానికి చేరుకున్నాడు.

జీవిత చరమాంకంలో ఒంటరిగా మిగిలిన ఆ తండ్రి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తను జీవితాంతం కష్టపడి కూడబట్టిన ఆస్తిని ప్రభుత్వానికి ధారాదత్తం చేశాడు. తన పేరున ఉన్న ఇల్లు, భూయి, మొత్తం కోటిన్నర విలువ చేసే ఆస్తి మొత్తం ప్రభుత్వానికి రాసిచ్చేశాడు. తన మరణానంతరం తాను ఇచ్చిన భూమిలో ఆస్పత్రిగాని, ఓ స్కూలు గాని కట్టించాలని విల్లులో రాశాడు. అంతే కాదు, తన మరణానంతరం మృదేహాన్ని సైతం ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు పరిశోధనల నిమిత్తం దానం చేసేసాడు. ఈ మేరకు విల్లు రాసాడు. తన అంత్ర్యక్రియలకు కూడా తన పిల్లలను అనుమతించరాదని ఆ విల్లులో రాశాడు. నాదూసింగ్‌ మరణానంతరం ఆయన రాసిన విల్లు అమలులోకి వస్తుందని సబ్‌ రిజిస్ట్రార్‌ తెలిపారు. తల్లిదండ్రుల పట్ల కనికరం లేని ఇలాంటి సంతానానికి కనువిప్పు కలిగించే ఈ తండ్రి నిర్ణయం స్థానికంగా సంచలనంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..