అసమాన ధైర్యశాలి.. అభినందన్‌కు వీరచక్ర

| Edited By:

Aug 15, 2019 | 6:13 PM

న్యూఢిల్లీ: పాక్ సైనికుల చేతినుంచి చెక్కు చెదరని ధైర్యసాహసాల చూపిన ఇండియన్ ఎయిర్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు యుద్ద సమయంలో అందించే దేశ మూడో అత్యున్నత శౌర్య పతకమైన వీర్‌చక్ర వరించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 27న భారత్, పాక్ మధ్య నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో మిగ్- 21 బైసన్ విమానాన్ని నడుపుతున్న అభినందన్ పాక్‌కు చెందిన ఎఫ్- 16 విమానాన్ని కూల్చివేశారు. ఆ తర్వాత ఆయన ఉన్న విమానం సైతం కూలిపోయింది. ఆ సమయంలో […]

అసమాన ధైర్యశాలి.. అభినందన్‌కు వీరచక్ర
Follow us on

న్యూఢిల్లీ: పాక్ సైనికుల చేతినుంచి చెక్కు చెదరని ధైర్యసాహసాల చూపిన ఇండియన్ ఎయిర్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు యుద్ద సమయంలో అందించే దేశ మూడో అత్యున్నత శౌర్య పతకమైన వీర్‌చక్ర వరించింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 27న భారత్, పాక్ మధ్య నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో మిగ్- 21 బైసన్ విమానాన్ని నడుపుతున్న అభినందన్ పాక్‌కు చెందిన ఎఫ్- 16 విమానాన్ని కూల్చివేశారు. ఆ తర్వాత ఆయన ఉన్న విమానం సైతం కూలిపోయింది. ఆ సమయంలో ఆయన పాకిస్తాన్‌ సరిహద్దు గ్రామంలోకి దూకాల్సి వచ్చింది. దీంతో పాక్ సైన్యానికి ఆయన చిక్కారు. శతృవు చేతికి చిక్కినా ఆయన ఎక్కడా తన ధైర్యాన్ని కోల్పోకుండా.. పాక్ అధికారులు అడిగిన ప్రశ్నలకు నిర్భయంగా చెప్పిన సమాధానాలు ఆయన గుండెల్లో ఉన్న ధైర్యానికి ప్రతీకగా నిలిచాయి. ఆయన తిరిగి భారత్‌కు క్షేమంగా చేరుకోవాలని భారతీయులంతా ఎంతగానో ఎదురుచూశారు. మూడు రోజుల తర్వాత ఆయనను భారత్‌కు అప్పగించింది. ఈ నేపథ్యంలో అసమాన ధైర్యాన్ని చూపి ఇండియా సత్తాను పాక్‌కు రుచిచూపించి మీసం మెలితిప్పిన అభినందన్ వర్ధమాన్‌కు భారత ప్రభుత్వం వీర్‌చక్ర పతకాన్ని అందజేసింది.

పుల్వామా ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై ఐఏఎఫ్ జరిపిన వైమానిక దాడుల్లో పాల్గొన్న ఐదుగురు పైలట్లకు కూడా మిలిటరీ అవార్డులు లభించాయి.