Ganesh Visarjan 2022: గణేష్ నిమజ్జనోత్సవాల్లో అపశృతి.. 13 మంది మృత్యువాత..

గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం రాత్రి (సెప్టెంబర్‌ 9)తో ముగిశాయి. ఐతే నిన్న రాత్రి దేశవ్యాప్తంగా జరిగిన గణేష్ నిమజ్జనోత్సవాల్లో పలు చోట్ల అపశ్రుతి చోటుచేసుకుంది..

Ganesh Visarjan 2022: గణేష్ నిమజ్జనోత్సవాల్లో అపశృతి.. 13 మంది మృత్యువాత..
Ganesh Visarjan

Edited By:

Updated on: Sep 10, 2022 | 6:28 PM

Vinayaka Nimajjanam 2022: గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం రాత్రి (సెప్టెంబర్‌ 9)తో ముగిశాయి. ఐతే నిన్న రాత్రి దేశవ్యాప్తంగా జరిగిన గణేష్ నిమజ్జనోత్సవాల్లో పలు చోట్ల అపశ్రుతి చోటుచేసుకుంది. హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 13 మంది మరణించారు. వివరాల్లోకెళ్తే.. హర్యానా రాష్ట్రంలోని సోనిపట్ జిల్లా మహేందర్ ఘడ్‌లోని యమునా నదిలో వినాయక విగ్రహాల నిమజ్జనం చేసే సందర్భంలో ప్రమాదవశాత్తు ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని కొత్వాలీ సఫీపూర్‌లో కూడా మరో ఆరుగురు మరణించారు. గంగానదిలో ఏడు అడుగుల గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా 9 మంది యువకులు నీటిలో గల్లంతయ్యారు. ముగ్గురిని ఎన్డీఆర్ఎఫ్ దళాలు రక్షించగా, ముగ్గురు పిల్లలతో సహా మొత్తం ఆరుగురు మృతి చెందారు. తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం రాత్రి సుమారు 1 గంట 15 నిముషాలకు అబిడ్స్ PS పరిధిలోని చెర్మాస్ అబిడ్స్ సమీపంలోని ఇండస్ IND బ్యాంక్ ముందు ప్రమాదం జరిగింది, శాలిబండకు చెందిన 20 ఏళ్ల జైసాయి అనే వ్యక్తి శారద విద్యాలయ పాఠశాల సమీపంలో, శాలిబండ పీఎస్ పరిధిలోని గణేష్ విగ్రహాన్ని తీసుకెళ్తుండగా లారీపై నుంచి అదుపుతప్పి కింద పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలపాలయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్ట్ కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. లారీ డ్రైవర్ సెంథిల్ కుమార్ ఆరుముగంను అదుపులోకి తీసుకున్నారు. అబిడ్స్ PSలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.