వరద బాధితులకు విరాళంగా బంగారం, వెండి..! ఎక్కడో కాదండోయ్..

1988 తర్వాత ఇంతటి విపత్తు ఎప్పుడూ చూడలేదని స్థానికులతో పాటు వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. బాధితులను ఆదుకోవడానికి సైన్యం, స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగాయి. పంజాబ్‌ వరదల నేపథ్యంలో చుట్టు పక్కల రాష్ట్రాల నుండి విరాళాల వెల్లువ కొనసాగింది. ఇందులో బంగారం, వెండి కూడా బాధితులకు విరాళంగా ఇచ్చారు దాతలు.

వరద బాధితులకు విరాళంగా బంగారం, వెండి..! ఎక్కడో కాదండోయ్..
gold and silver donated to flood victims

Updated on: Sep 09, 2025 | 3:34 PM

ఉత్తరాది రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు తీవ్ర నష్టం మిగిల్చాయి. ఆయా రాష్ట్రాలపై వరుణుడు పగబట్టినట్టుగా నెల రోజుల పాటు కుండపోత వర్షాలు కురిశాయి. ముఖ్యంగా పంజాబ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. నదులు ఉప్పొంగి గ్రామాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. 23 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 1988 తర్వాత ఇంతటి విపత్తు ఎప్పుడూ చూడలేదని స్థానికులతో పాటు వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. బాధితులను ఆదుకోవడానికి సైన్యం, స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగాయి. పంజాబ్‌ వరదల నేపథ్యంలో చుట్టు పక్కల రాష్ట్రాల నుండి విరాళాల వెల్లువ కొనసాగింది. ఇందులో బంగారం, వెండి కూడా బాధితులకు విరాళంగా ఇచ్చారు దాతలు.

అవును, మీరు చదివింది నిజమే.. పంజాబ్‌ వరదల నేపథ్యంలో కొండ ప్రాంతాల్లో పడిన వర్షాల కారణంగా దాదాపు 2వేల గ్రామాలు ప్రభావితమయ్యాయి. వారికి సాయం అందించేందుకు మేవాట్‌ గ్రామస్థులు ముందుకొచ్చారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు వారి శక్తి మేరకు సాయం అందించారు. కొందరు మహిళలు బంగారం, వెండిని కూడా విరాళంగా అందించారు. త‌ల‌క్‌పురి గ్రామానికి చెందిన 75 ఏళ్ల ర‌హీమితో పాటు మ‌రికొంత‌మంది మ‌హిళ‌లు రూ.5 ల‌క్ష‌ల విలువైన 2 కిలోల వెండి, 20 గ్రాముల బంగారం విరాళంగా ఇచ్చారు.

దీంతోపాటు దుప్పట్లు, రొట్టెలు వంటివి కూడా ఆ గ్రామస్థులు బాధితులకు సాయంగా పంపారు. ఇలా 250కి పైగా ట్రక్కుల్లో ఇప్పటివరకు మానవతాసాయాన్ని అందజేశారు. గ్రామస్థుల ప్రయత్నాలను నుహ్‌ డిప్యూటీ కమిషనర్‌ అఖిల్‌ పిలాని ప్రశంసించారు. ఈ సహాయం తరలింపులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…