వీడు అసలు మనిషేనా.. అమ్మను అతనితో సన్నిహితంగా మెలగమని చెప్పి.. ఆపై

వీడికంటే దరిద్రుడు ఉంటాడా చెప్పండి. సొంత తల్లినే హనీ ట్రాప్ కోసం ఉపయోగించుకున్నాడు. తాజాగా ఓ బ్యాంక్ మేనేజర్‌కు స్పాట్ పెట్టారు. అయితే అతను పోలీసులను ఆశ్రయించడంతో బాగోతం బయటపడింది. కర్నాటకలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ...

వీడు అసలు మనిషేనా.. అమ్మను అతనితో సన్నిహితంగా మెలగమని చెప్పి.. ఆపై
Karnataka Honeytrap(representative image)

Updated on: Nov 20, 2025 | 10:34 AM

సభ్యసమాజం తల దించుకునే ఘటన ఇది. మానవ సంబంధాలు ఏ స్థాయికి దిగజారాయో తెలియజేసే ఘటన కర్నాటకలో విజయపుర జిల్లాలో వెలుగుచూసింది. ఇండి టౌన్‌లో పని చేసే ఓ బ్యాంకు మేనేజర్‌ను తల్లీ కొడుకు కలిసి హనీ ట్రాప్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ మేనేజర్‌తో శారీరక సబంధం ఏర్పచుకునేలా తల్లిని ఉసిగొల్పాడు కొడుకు. ఆపై వారు సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియో షూట్ చేసి బెదిరింపులకు దిగాడు. వివరాల్లోకి వెళ్తే.. బ్యాంకుకు దగ్గర్లో కొబ్బరి బోండాలు అమ్మే మహిళతో మేనేజర్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం సన్నిహిత సంబంధానికి దారితీసింది. నవంబర్ 1న తాను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటానని.. రమ్మని కోరింది సదరు మహిళ. ఇద్దరు చనువుగా మెలుగుతున్నప్పుడు కిటీలో ఫోన్ ఉంచి.. ఆ దృశ్యాలను షూట్ చేసింది. మేనేజర్ ఫోన్‌ను గుర్తించి.. అక్కడ ఎందుకు పెట్టావని ప్రశ్నించగా.. అది పాడయిపోయిందని సమాధానమిచ్చింది.

ఆ తర్వాత.. నవంబర్ 5న ఆమె మేనేజర్‌కు ఫోన్ చేసి.. మనం సన్నిహితంగా ఉన్నప్పుడు ఎవరో వీడియో తీశారని.. డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పడంతో అతను ఆందోళనకు గురయ్యాడు. వారితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలని ఆమె మేనేజర్‌కు చెప్పింది. ఆ తర్వాత ఆమె కుమారుడు అమూల్, అల్లుడు మహేశ్ బగలి, ఓ పేపర్ రిపోర్టర్ తౌసిఫ్ కలిసి… మేనేజర్‌కు ఫోన్ చేసి 10 లక్షలు ఇవ్వాలని.. లేదంటే ఆ దృశ్యాలను టీవీ ఛానళ్లలో వేస్తామని బెదిరింపులకు దిగారు. తర్జన భర్జన పడిన మేనేజర్.. చివరకు ఏదైతే అది అవుతుందని పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఎంక్వైరీ చేయగా ఈ మూఠా బాగోతం వెలుగుచూసింది. అమూల్‌ను అరెస్ట్ చేయగా.. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు. కాగా ఆ మహిళ సాయంతో గతంలో కూడా వారు పలువరి నుంచి ఇలానే డబ్బు గుంజారని పోలీసుల విచారణలో తేలింది.

Accused Mahesh, Tausheef and Amul

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us