Vijay Rupani: లండన్‌ టికెట్‌ను రెండుసార్లు రద్దు చేసుకున్న విజయ్‌ రూపానీ.. మూడో సారి వెళ్తుండగా ముంచుకొచ్చిన మృత్యువు!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు విజయ్‌ రూపానీ మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈయన ఈ ప్రయాణానికి ముందు కూడా రెండుసార్లు లండన్‌ వెళ్లేందుకు టికెట్‌ను బుక్‌ చేసుకొని కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్లీ రద్దు చేసుకున్నారు. లండన్‌లో ఉన్న భార్య, కుమార్తెను కలిసేందుకు తొలుత మే 19న, మరోసారి జూన్ 5న టికెట్స్‌ బుక్‌ చేసుకొని రద్దు చేసుకున్నారు విజయ్ రూపానీ.

Vijay Rupani: లండన్‌ టికెట్‌ను రెండుసార్లు రద్దు చేసుకున్న విజయ్‌ రూపానీ.. మూడో సారి వెళ్తుండగా ముంచుకొచ్చిన మృత్యువు!
Vijay Rupani

Updated on: Jun 14, 2025 | 4:04 PM

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు విజయ్‌ రూపానీ మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈయన ఈ ప్రయాణానికి ముందు కూడా రెండుసార్లు లండన్‌ వెళ్లేందుకు టికెట్‌ను బుక్‌ చేసుకొని కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్లీ రద్దు చేసుకున్నారు. అయితే విజయ్‌ రుపానీ భార్య, కుమార్తె లండన్‌లో ఉంటున్నారు. అయితే ఇటీవల వాళ్లను కలిసేందుకు విజయ్‌ రూపానీ వెళ్లాలి అనుకున్నారు. ఈ క్రమంలో మే 19న లండన్‌ వెళ్లేందుకు ఎయిర్‌ ఇండియా విమానంలో టికెట్‌ బుక్ చేసుకున్నారు. అయితే ఇక్కడ కొన్ని అత్యవసర షెడ్యూల్స్‌ కారణంగా ఆయన మే 19న లండన్‌ వెళ్లే ప్రయాణాన్ని క్యాన్సల్‌ చేసుకొని విమాన టికెట్‌ను రద్దు చేసుకుకున్నారు.

మొదట అనుకున్న షెడ్యూల్‌ సక్సెస్‌ కాకపోవడంతో మరోసారి జూన్ 5న లండన్ వెళ్లాలని నిర్ణయించి మళ్లీ టికెట్‌ బుక్ చేసుకున్నారు. కానీ అప్పుడు కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల జూన్‌ 5న వెళ్లాల్సిన ప్రయాణాన్ని కూడా వాయిదా వేసుకొని విమాన టికెట్‌ను రెండోసారి రద్దు చేసుకున్నారు. ఇక మూడో సారి తప్పుకుండా వెళ్లాలని నిర్ణయించుకున్న ఆయన జూన్‌ 12న లండన్‌ వెళ్లేందుకు ఎయిర్‌ ఇండియా విమానం AI 171లోని సీటు నంబర్ 2డీని బుక్ చేసుకున్నారు.

ఇక అనుకున్న ప్రకారం గురువారం( జూన్ 12) మధ్యాహ్నం ఫ్లైట్‌ ఎక్కారు. అయితే అయన ప్రయాణిస్తున్న ఎయిర్‌ ఇండియా AI 171 విమానం రన్‌వే నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే అహ్మదాబాద్‌ ఎయిర్‌ పోర్ట్ సమీపంలోని ఓ బిడ్జింగ్‌ను ఢీకొట్టి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విజయ్‌ రూపానీతో పాటు విమానంలో ప్రియాణిస్తున్న 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. విమానం మెడికల్‌ కాలేజ్‌ను ఢీకొట్టడంతో కాలేజ్‌లో ఉన్న 33 మంది మెడికల్ విద్యార్థులు కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. ఇలా ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు మొత్తం 274 మంది మరణించారు. కేవలం ఒకే ఒక్క వ్యక్తి ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..