Vijay Mallya: ఇండియాలోని నా లాయర్లకు ఫీజు చెల్లించాలి, డబ్బులివ్వండి..లండన్ కోర్టును కోరిన విజయ్ మాల్యా

Vijay Mallya: ఇండియాలోని తన లాయర్లకు తాను ఫీజు చెల్లించాలని, కానీ తన చేతిలో సొమ్ము లేనందున తనకు కోర్టు ఫండ్స్ కార్యాలయం నుంచి 758,000 పౌండ్లను..

Vijay Mallya: ఇండియాలోని నా లాయర్లకు ఫీజు చెల్లించాలి, డబ్బులివ్వండి..లండన్ కోర్టును కోరిన విజయ్ మాల్యా
Vijay Mallya

Edited By:

Updated on: May 26, 2021 | 11:11 AM

ఇండియాలోని తన లాయర్లకు తాను ఫీజు చెల్లించాలని, కానీ తన చేతిలో సొమ్ము లేనందున తనకు కోర్టు ఫండ్స్ కార్యాలయం నుంచి 758,000 పౌండ్లను (రూ.7.8 కోట్లను) ఇప్పించాలని బిజినెస్ టైకూన్ (?) విజయ్ మాల్యా లండన్ కోర్టును కోరారు. భారత దేశంలో తన ఆస్తులను స్తంభింప జేసినందున తను న్యాయవాదులకు ఫీజు చెల్లించలేకపోతున్నానని ఆయన పేర్కొన్నారు. లోగడ తాను దాఖలు చేసిన పిటిషన్ ను పురస్కరించుకుని నెలకు 23 లక్షలు చెల్లించవచ్చునని డిప్యూటీ ఐసీసీ జడ్జి బార్నెట్ గత ఫిబ్రవరిలో తీర్పు ఇచ్చ్చారని, కానీ అసలు ఇండియాలోని లాయర్లకు చెల్లించే ఫీజు ఇందులో ఉండబోదని పేర్కొన్నారని ఆయన అన్నారు. అలాగే కోర్టు నిధులనుంచి రూ. 12 కోట్లను పొందేందుకు అనుమతి ఇచ్చినా ఇందులో ఒక్క రూపాయి కూడా తన న్యాయవాదులకు చెల్లించరాదని జడ్జ్ మెంట్ ఇచ్చారన్నారు. ఆ తీర్పును సవాలు చేస్తూ విజయ్ మాల్యా హైకోర్టుకెక్కారు. తన క్లయింటు మాల్యాకు ఇండియాలో 5.7 కోట్ల రుణాలు ఉన్నాయని అందువల్ల ఆయనకు భవిష్యత్ ఖర్చులకోసం కనీసం 2 కోట్లయినా అత్యవసరమని ఆయన తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు మా క్లయింటు రాజీ సెటిల్మెంట్ కేసు ఇండియాలోని సుప్రీంకోర్టులో పెండింగులో ఉంది.. దానిపై విచారణ జరగాల్సి ఉంది. కానీ ఈ పాండమిక్ కారణంగానూ, ఇతర కారణాల వల్ల సుప్రీంకోర్టులో ప్రొసీడింగ్స్ త్వరగా జరగడంలేదు అని ఆ న్యాయవాది పేర్కొన్నారు.

నిధుల కొరత కూడా ఓ కారణంగా ఉందని, అందువల్ల తన క్లయింటును ఈ తరుణంలో ‘ఆదుకోవాలని’ ఆ లాయర్ కోర్టును కోరారు. సుప్రీంకోర్టులో రాజీ సెటిల్మెంట్ కేసు విచారణ త్వరగా జరిగి తన క్లయింటుకు న్యాయం జరిగితే ఇబ్బంది ఉండబోదన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: తన ఓనర్ కార్ పార్కింగ్ చేసిన కుక్క..చూస్తే పక్కా షాక్ అవుతారు..! ( వీడియో )

Oxygen Special Train: అనంతపురం చేరుకున్న ఆక్సిజన్‌ మరో స్పెషల్‌ రైలు.. జిల్లాలకు తరలిస్తున్న అధికారులు