ఏనుగులకు కరోనా టెస్టులు.. రీజన్ ఇదే..

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో.. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే 78 లక్షలకు పైగా చేరుకున్నాయి.

  • Tv9 Telugu
  • Publish Date - 7:55 pm, Sun, 14 June 20
ఏనుగులకు కరోనా టెస్టులు.. రీజన్ ఇదే..

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో.. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే 78 లక్షలకు పైగా చేరుకున్నాయి. అయితే ఈ కరోనా వైరస్.. మనుషులతో పాటు.. పలుచోట్ల జంతువులకు కూడా వచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీంతో జంతువులను కూడా జాగ్రత్తగా పరిరక్షిస్తున్నారు.
తాజాగా రాజస్థాన్‌లో ఏనుగులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. అమెర్ కోట ప్రాంతం, హతీ గావ్ పరిసర ప్రాంతాల్లోని 109 ఏనుగులకు కరోనా టెస్టులు చేసినట్లు వెటర్నరీ వైద్యులు వెల్లడించారు. ఆరు నెలలకు ఓ సారి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌ అధికారులు ఆరోగ్య పరీక్షలు చేస్తుంటుందని.. అందులో భాగంగా నిర్వహించిన పరీక్షల్లో.. 103 ఏనుగులకు కరోనా టెస్టులు నిర్వహించినట్లు తెలిపారు. ముందు జాగ్రత్తలో భాగంగా ఈ పరీక్షలు నిర్వహించామని.. వీటికి సంబంధించిన రిపోర్టుల మరో పది రోజుల్లో వస్తాయని తెలిపారు.