వెస్ట్ బెంగాల్‌లో ఉద్రిక్తత.. టీఎంసీ-బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ..

వెస్ట్ బెంగాల్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ చేపట్టిన పన్నెండు గంటల బంద్‌ సందర్భంగా రాష్ట్రంలో పలుచోట్ల ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా కుచ్‌బేహ్‌ జిల్లాలోని తుఫ్‌గంజ్‌ ప్రాంతంలో..

వెస్ట్ బెంగాల్‌లో ఉద్రిక్తత.. టీఎంసీ-బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ..

Edited By:

Updated on: Jul 15, 2020 | 4:22 AM

వెస్ట్ బెంగాల్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ చేపట్టిన పన్నెండు గంటల బంద్‌ సందర్భంగా రాష్ట్రంలో పలుచోట్ల ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా కుచ్‌బేహ్‌ జిల్లాలోని తుఫ్‌గంజ్‌ ప్రాంతంలో అధికార టీఎంసీ పార్టీ శ్రేణులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇటీవల బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే మృతి పట్ల.. మంగళవారం నాడు రాష్ట్రంలో పన్నెండు గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో పలుచోట్ల టీఎంసీకి వ్యతిరేకంగా బీజేపీ నేతలు నిరసనలు తెలిపారు. అదే సమయంలో బీజేపీ శ్రేణులపై టీఎంసీకి చెందిన కార్యకర్తలు దాడులకు దిగారు. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

కాగా,బీజేపీ మ్మెల్యే దేబేంద్ర నాథ్‌ రాయ్‌ రెండు రోజుల క్రితం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణంపై అనేక అనుమానాలను లేవనెత్తింది బీజేపీ. ఆయనను చంపేసి.. ఉరి తీశారని ఆరోపించింది. ఆయన వేలాడుతున్న దృశ్యం చూస్తే ఇది హత్యేనని ఎవరికైనా అర్ధమవుతుందని.. ఈ హత్యపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే దేబేంద్ర నాథ్‌ రాయ్‌ గత కొద్ది రోజుల క్రితం టీఎంసీ నుంచి బీజేపీలోకి చేరారు.