Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నదిలో పడిపోయిన ఆర్మీ వాహనం.. ఆరుగురు జవాన్ల మృతి

ITBP Bus Accident: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఆర్మీ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ యాక్సిడెంట్‌లో మొత్తం ఆరుగురు జవాన్లు మృతిచెందగా మరో 32 మంది గాయపడ్డారు. చందన్వారి పహల్గామ్‌లో ఈ  దుర్ఘటన జరిగింది.

Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నదిలో పడిపోయిన ఆర్మీ వాహనం.. ఆరుగురు జవాన్ల మృతి
Itbp Bus Accident

Updated on: Aug 16, 2022 | 12:40 PM

ITBP Bus Accident: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఆర్మీ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ యాక్సిడెంట్‌లో మొత్తం ఆరుగురు జవాన్లు మృతిచెందగా మరో 32 మంది గాయపడ్డారు. చందన్వారి పహల్గామ్‌లో ఈ  దుర్ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. కాగా బస్సులో మొత్తం 39 మంది ఉన్నారని, అందులో 37 మంది ఐటీబీపీకి చెందినవారని, ఇద్దరు జమ్మూ కశ్మీర్ పోలీసులకు చెందినవారని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు తెలిపారు. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో రోడ్డుపక్కన ఉన్న నది ఒడ్డున పడిపోయింది. సైనికులు చందన్‌వాడి నుంచి పహల్‌గాం వైపు వెళ్లుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాద వార్త అందుకున్న పోలీసులు, ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని జవాన్లను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరింత ప్రాణనష్టం జరిగే అవకాశాలున్నాయని ఇండో టిబెటన్‌ పోలీసులు చెబుతున్నారు.

కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉంది.