Uttarpradesh: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. రెండు గ్రూపుల మధ్య ఘర్షణ..!

Uttarpradesh: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మార్కెట్ బంద్ విషయంలో రెండు గ్రూపులు మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణ హింసాత్మకంగా మారింది.

Uttarpradesh: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. రెండు గ్రూపుల మధ్య ఘర్షణ..!
Clashes

Updated on: Jun 04, 2022 | 7:59 AM

Uttarpradesh: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మార్కెట్ బంద్ విషయంలో రెండు గ్రూపులు మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణ హింసాత్మకంగా మారింది. కాల్పులు, పొగ బాంబులు, రాళ్లతో పరస్పరం దాడులకు తెగబడ్డారు. వెంటనే అలర్ట్ అయిన కాన్పూర్ పోలీసులు.. భారీ ఎత్తున మోహరించారు. ఘర్షణలకు దిగిన ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అల్లర్లకు పాల్పడిన వారిలో 18 మందిని అదుపులోకి తీసుకున్నట్లు కాన్పూర్ పోలీస్ కమిషనర్ విజయ్ సింగ్ మీనా తెలిపారు. కాగా, ఈ ఘర్షణలలో ముగ్గురు గాయపడగా.. వారిలో ఇద్దరు పౌరులు, ఒక పోలీసు ఉన్నారు. కొందరు వ్యక్తులు దుకాణాలు మూయించేందుకు ప్రయత్నించడం, మరో వర్గం వారు షాపులను మూసివేయడాన్ని వ్యతిరేకించడంతో ఈ ఘర్షణ తలెత్తిందని విజయ్ సింగ్ మీనా తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us