
Uttarakhand Glacier Burst Updates: హిమాలయాల్లో మంచుచరియలు విరిగిపడటంతో దేవభూమి ఉత్తరాఖండ్‌ను జలప్రళయం అతలాకుతలం చేసింది. దీంతో చమోలీ జిల్లాలోని జోషిమఠ్ సమీపంలోని ధౌలి గంగానది ఉప్పెనలా పోటెత్తింది. ఆదివారం అలకనంద, ధౌలి గంగా నదుల పరివాహక ప్రాంతాల్లో ఉన్నవారంతా వరదలో చిక్కుకుపోయారు. తపోవన్–రేణిలో ఎన్‌టీపీసీ నిర్మిస్తున్న 13.2 మెగావాట్ల రిషిగంగ విద్యుత్ ప్రాజెక్టు కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదం అనంతరం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సాయుధ దళాలు నిరంతరం రెస్క్యూ నిర్వహిస్తున్నాయి.
14 మంది మృతదేహాలు స్వాధీనం..
అయితే ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 14 మంది మరణించారని ఛమోలీ పోలీసులు వెల్లడించారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని.. ఇప్పటివరకు మొత్తం 15 మందిని రక్షించినట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో దాదాపు 170 మంది వరకు తప్పిపోయారు. టెన్నెళ్ల ప్రాంతాల్లో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. ఇదిలాఉంటే.. సోమవారం ఉదయం కూడా ధౌలీ గంగానదిలో వరద ప్రవాహం ఒక్కసారిగా పోటెత్తింది. నిన్న సంభవించిన వరదల తరువాత రాత్రి 8గంటల సమయంలో ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దీంతో అధికారులు అప్రమత్తమై ఆయా ప్రాంతాల్లోకి ఎవరూ రాకుండా చర్యలు తీసుకున్నారు.
Also Read: