Uttarakhand Glacier Burst Updates: హిమాలయాల్లో మంచుచరియలు విరిపడి దేవభూమి ఉత్తరాఖండ్‌ను వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. చమోలీ జిల్లాలోని జోషిమఠ్ సమీపంలో ధౌలి గంగానది ఉప్పొంగడంతో దాదాపు 250మంది వరదలో గల్లంతయ్యారు. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 32కి చేరింది. ఇంకా గల్లంతైన 171 మంది ఆచూకీ కోసం అన్వేషిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మంగళవారం ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయని.. వీటితో కలిపి ఇప్పటివరకు 32 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నిరంతరం సహాయక చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ బృందాలు మమ్మురంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. తపోవన్ టన్నెల్‌లో భారీగా బురద, వ్యర్థాలు పేరుకుపోగా.. వాటిని తొలగిస్తూ.. చిక్కుకున్న 30 మంది కోసం సిబ్బంది గాలిస్తున్నారు.
నది ప్రవాహం ధాటికి వంతెన కొట్టుకుపోవడంతో బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయిన 13 గ్రామాలవారికి హెలికాప్టర్ల ద్వారా నిత్యావసరాలను, ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇదిలాఉంటే.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ ఏరియల్ సర్వే నిర్వహించి విపత్తును పరిశీలించారు. దీంతోపాటు జోషిమఠ్‌లోని ఐటీబీపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని సీఎం పరామర్శించి భరోసానిచ్చారు.
Also Read: