Bridal Lehenga: అత్తగారు పంపించిన లెహంగా నచ్చలేదని పెళ్లిని రద్దు చేసుకున్న వధువు…లక్ష రూపాయలతో రద్దు ఒప్పందం

|

Nov 10, 2022 | 7:59 AM

పెళ్లి వరకూ వచ్చిన పెళ్లిళ్లు మండపంలోనే రద్దవుతున్నాయి. వరుడు సమయానికి రాలేదని.. మర్యాదలు జరగలేదని, విందు నచ్చలేదని.. ఇలా రకరకాల చిన్న చిన్న కారణాలతో పెళ్లిని రద్దుచేసుకుంటున్నారు వధూవరులు.. అసలు పెళ్లి కోసం తమ ఫ్యామిలీ పడిన కష్టం, పెట్టిన  ఖర్చు, కుటుంబ పరువు, పలుకుబడి, సమాజం ఇలా దేని గురించి ఆలోచించలేదు.

Bridal Lehenga: అత్తగారు పంపించిన లెహంగా నచ్చలేదని పెళ్లిని రద్దు చేసుకున్న వధువు...లక్ష రూపాయలతో రద్దు ఒప్పందం
Bridal Lehenga
Follow us on

కాలం మారింది.. మారిన కాలంతో పాటు మనుషుల ఆలోచనలు అభిప్రాయాలు మారుతూ వస్తున్నాయి. సాంప్రదాయం, ఆచార వ్యవహారాలు, బంధాలు అన్నిటిలోనూ మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. చిన్న చిన్న కారణాలతో బంధాలను వదిలేస్తున్నారు..  పెళ్లిళ్లు రద్దు చేసుకోవడం  సర్వ సాధారణమైపోయింది. పెళ్లి వరకూ వచ్చిన పెళ్లిళ్లు మండపంలోనే రద్దవుతున్నాయి. వరుడు సమయానికి రాలేదని.. మర్యాదలు జరగలేదని, విందు నచ్చలేదని.. ఇలా రకరకాల చిన్న చిన్న కారణాలతో పెళ్లిని రద్దుచేసుకుంటున్నారు వధూవరులు.. అసలు పెళ్లి కోసం తమ ఫ్యామిలీ పడిన కష్టం, పెట్టిన  ఖర్చు, కుటుంబ పరువు, పలుకుబడి, సమాజం ఇలా దేని గురించి ఆలోచించలేదు. నచ్చలేదు.. అంటూ సింపుల్ గా పెళ్లిని రద్దు చేసుకుని పెళ్ళిపీటల మీద నుంచి వెళ్లిపోతున్నారు. తాజాగా ఓ నవ వధువు పెళ్ళికి తెచ్చిన లెహంగా నచ్చలేదంటూ పెళ్లిని రద్దు చేసుకుని వార్తల్లోనిలిచింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

నైనిటాల్ లోని హల్ద్వానీలో నివసిస్తున్న యువతి..  అల్మోరాలో ఉంటున్న యువకుడుకి పెళ్లి నిశ్చయం అయింది. ఇరువురికి నవంబర్ 5న పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు పెద్దలు. పెళ్లి వేడుకల్లో భాగంగా వరుడి తండ్రి రూ. 10,000 విలువైన లెహంగాను ఆర్డర్ చేశారు. కాబోయే కోడలోకి ఆ లెహంగా పంపించారు. అయితే ఆ లెహంగా వధువుకు అది నచ్చలేదు. అంతేకాదు.. పెళ్లి కూతురు తల్లి కూడా ఆ లెహంగా నచ్చలేదు.

ఈ  విషయం పెళ్లి కొడుకు ఇంటి సభ్యులకు తెలిసింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య లెహంగా కోసం వాగ్వాదం జరిగింది. ఆ గొడవ చినికి చినికి గాలి వానగా మారినట్లు… పెద్ద వివాదం నెలకొంది. ఏకంగా ఇరు కుటుంబ సభ్యులు పెళ్లిని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అక్టోబరు 30న పెళ్లి కొడుకు బంధువులు వధువు ఇంటికి వెళ్లి లక్ష రూపాయల నగదు ఇచ్చి పెళ్లి రద్దు చేసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. ఇదే విషయం ఎప్పుడైనా సాక్ష్యానికి పనికి వస్తుందంటూ.. వరుడు పెద్దలు వీడియో కూడా తీశారు.

ఇవి కూడా చదవండి

అయితే  పెళ్లికూతురు కుటుంబ సభ్యులు పెళ్లి విషయంలో మనసు మార్చుకున్నారు. మళ్లీ వద్దనుకున్న వారే.. పెళ్లి చేద్దాం అంటూ వరుడు యువకుడి ఇంటికి వెళ్లి పెళ్లి గురించి మాట్లాడారు. అయితే అక్కడ మళ్ళీ గొడవ జరిగింది. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. విషయం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసుల సమక్షంలో కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మళ్ళీ గొడవకు దిగారు. ఇరు వర్గాల వారికీ పోలీసులు నచ్చ చెప్పారు. దీంతో వధూవరుల కుటుంబ సభ్యులు పెళ్లి ఆలోచన విరమించుకుని ఎవరి ఇంటికి వారు చేరుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..