Wolf Caught: బహ్రైచ్‌లో పట్టుబడిన ఐదవ తోడేలు.. మరొక దాని కోసం గాలిస్తున్న అధికారులు..

|

Sep 10, 2024 | 9:36 AM

తోడేళ్ళను పట్టుకునేందుకు 200 మంది పీఏసీ సిబ్బందిని రంగంలోకి దించారు. అటవీ శాఖకు చెందిన 25 బృందాలు రంగంలోకి దిగాయి. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంకా ఒక తోడేలు మిగిలి ఉందని, దానిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. తమ బృందం ఐదో తోడేలును పట్టుకున్నట్లు డీఎఫ్‌వో అజిత్ ప్రతాప్ సింగ్ తెలిపారు.

Wolf Caught: బహ్రైచ్‌లో పట్టుబడిన ఐదవ తోడేలు.. మరొక దాని కోసం గాలిస్తున్న అధికారులు..
Wolf Caught In Bahraich
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో తోడేళ్లు భీభత్సం సృష్టించాయి. తోడేళ్ల దాడిలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 30 మందికి పైగా గాయపడ్డారు. తోడేళ్ల అన్వేషణ కోసం పోలీసులు, అటవీ శాఖ బృందాలు ఆ ప్రాంతంలో నిరంతరం సోదాలు నిర్వహిస్తున్నాయి. అటవీ శాఖ అధికారులు మరో తోడేలును పట్టుకున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే 4 తోడేళ్ళు పట్టుబడ్డాయి. దీంతో ఇప్పటి వరకూ మొత్తం ఐదు తోడేళ్లను బందించినట్లు తెలుస్తోంది. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మరో తోడేలు మిగిలి ఉందని.. దానిని కూడా వెతుకుతున్నట్లు చెప్పారు.

మహసీ తహసీల్ బహ్రైచ్ జిల్లాలో ఉంది. ఈ తహసీల్‌లోని 40 గ్రామాల్లో తోడేళ్లు భీభత్సం సృష్టించాయి. ఈ ఏడాది మార్చిలో తొలిసారిగా 7 ఏళ్ల చిన్నారిపై తోడేలు దాడి చేసింది. ఆ తర్వాత నుంచి తోడేళ్ల దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ఆ ప్రాంతంలో అటవీ శాఖ బృందాన్ని అప్రమత్తం చేయగా.. 6 తోడేళ్ల గుంపు మనుషులను లక్ష్యంగా చేసుకుని సంచరిస్తున్నట్లు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

డ్రోన్ల ద్వారా కూడా నిఘా

తోడేళ్ల నిరంతర దాడులను పసిగట్టిన రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వాటిని వీలైనంత త్వరగా పట్టుకోవాలని స్వయంగా అధికారులకు ఫోన్ చేసి ఆదేశాలు జారీ చేశారు. తోడేళ్ళు తిరుగుతున్న జాడలున్న ఆ ప్రాంతంలో తోడేళ్లను పట్టుకోవడానికి బోనులను ఏర్పాటు చేశారు. వాటి ప్రతి కదలికను గమనించేందుకు కెమెరాలు కూడా అమర్చారు. అంతేకాకుండా డ్రోన్ల ద్వారా కూడా నిఘా పెట్టారు.

తోడేళ్ళను పట్టుకునేందుకు 200 మంది పీఏసీ సిబ్బందిని రంగంలోకి దించారు. అటవీ శాఖకు చెందిన 25 బృందాలు రంగంలోకి దిగాయి. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంకా ఒక తోడేలు మిగిలి ఉందని, దానిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. తమ బృందం ఐదో తోడేలును పట్టుకున్నట్లు డీఎఫ్‌వో అజిత్ ప్రతాప్ సింగ్ తెలిపారు. ఒకటి మిగిలి ఉంది త్వరలో ఆ తోడేలును కూడా పట్టుకుంటామని స్పష్టం చేశారు.

DFO అజిత్ ప్రతాప్ సింగ్ చెప్పిన ప్రకారం తోడేళ్ళు నరమాంస భక్షకులుగా మారాయని తెలుస్తోంది. గుంపులు గుంపులుగా దాడులు చేసేవి. వీటిని పట్టుకునేందుకు తమ బృందం తీవ్రంగా శ్రమించిందన్నారు. కుంటి తోడేలు అనే ప్రశ్నపై అజిత్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ ఇది పుకారు అని అన్నారు. కుంటి తోడేలు లేదని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..