Murder: భర్తను చంపి, రాత్రంతా శవంతోనే పడుకుంది.. ఉదయాన్నే లేచి బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది.. కట్ చేస్తే..

|

Dec 21, 2022 | 5:13 AM

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ భార్య తన భర్తను హత్య చేసి రాత్రంతా శవంతోనే పడుకుంది. ఉదయం నిద్రలేచిన తరువాత పిల్లలు అతన్ని లేపేందుకు ప్రయత్నించగా..

Murder: భర్తను చంపి, రాత్రంతా శవంతోనే పడుకుంది.. ఉదయాన్నే లేచి బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది.. కట్ చేస్తే..
Crime News
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ భార్య తన భర్తను హత్య చేసి రాత్రంతా శవంతోనే పడుకుంది. ఉదయం నిద్రలేచిన తరువాత పిల్లలు అతన్ని లేపేందుకు ప్రయత్నించగా.. డాడీ పడుకున్నాడు లేపొద్దు అంటూ వారిని వారించింది. ఆ తరువాత తీరిగ్గా తాను బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. కానీ, విషయం ఎక్కువసేపు దాగదుగా.. ఇక్కడ కూడా అదే జరిగింది. మ్యాటర్ పోలీసుల వరకు వెళ్లింది. రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితురాలైన భార్యను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించగా షాకింగ్ వివరాలు వెల్లడించింది.

అతుల్, అన్నూ ఇద్దరు దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అన్నూ ఓ బ్యూటీ పార్లర్‌లో పని చేసేది. ఇంటికి వచ్చి కుటుంబాన్ని చూసుకునేది. ఇక అతుల్.. పని చేసినా ఆ కష్టమంతా మద్యానికే దారపోసేవాడు. సాయంత్రం అవగానే పీపాలకు పీపాలు తాగేసి ఇంటికొచ్చేవాడు. ఇంట్లో తన భార్యతో ఘర్షణకు దిగేవాడు. ఇదే తంతు రోజూ సాగేది. డిసెంబర్ 15న అతుల్ మద్యం సేవించి అర్థరాత్రి వచ్చి అన్నును కొట్టాడు. ఇక భరించలేకపోయిన అన్నూ.. ఇంట్లోని ఓ కర్ర తీసుకుని అతుల్ తలపై కొట్టింది. దాంతో అతను స్పృహ తప్పి పడిపోయాడు. అంతటితో ఆగకుండా.. అతని గొంతు నులిమి చంపేసింది. అనంతరం రాత్రంతా శవం వద్దే నిద్రపోయింది అన్నూ. అర్థరాత్రి దాటిన తరువాత భర్త అతుల్ మృతదేహాన్ని లాగి గేటు వద్ద పడేసింది. తెల్లవారుజామున ఇక తన డ్రామా మొదలు పెట్టింది. మద్యం సేవించి వచ్చి కిందపడి చనిపోయాడంటూ సీన్ క్రియేట్ చేసింది అన్నూ.

విషయం తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తొలుత మద్యం అతిగా సేవించడం వల్లే అతుల్ చనిపోయాడని భావించారు పోలీసులు. కానీ, విచారణలో అసలు నిజం బయటపడింది. అతని చావుకు మద్యం కారణం కాదని, భార్యే అతన్ని హతమార్చిందని నిర్ధారించారు. కట్టుకున్న భార్య గొంతునులిమి చంపేసినట్లు గుర్తించారు. విచారణలో అన్నూ నిజాన్ని అంగీకరించడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..