
పదేళ్ల బాలుడి నిస్సహాయత, ధైర్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తన తల్లిని కోల్పోయిన బాలుడు, జిల్లా ఆసుపత్రిలో ఆమె మృతదేహంతో ఒంటరి నిశ్చేష్టుడిలా మిగిలిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో ఆ చిన్నారి తల్లి క్షయ, హెచ్‌ఐవి వంటి తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతోంది. బుధవారం (జనవరి 14) రాత్రి చికిత్స సమయంలో ఆమె మరణించింది. విషాదకర విషయం ఏమంటే, ఆ మహిళ మరణించినప్పుడు, ఆ చిన్నారి తప్ప బంధువులు గానీ ఇరుగుపొరుగువారు కానీ ఎవరూ లేరు. ఆ చిన్నారి తన తల్లి మృతదేహం దగ్గర గంటల తరబడి కూర్చుని, ఎవరైనా వస్తారని ఎదురు చూశాడు. కానీ సమాజం అతని వైపు కన్నేత్తి సైతం చూడలేదనిపించింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో జరిగిన ఈ సంఘటన గురించి పోలీసులకు తెలియగానే, అధికారులు వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. కన్నీళ్లతో, ఆ అమాయక బాలుడిని దగ్గరకు తీసుకుని విచారణ చేపట్టారు. అతను చెప్పిన మాటలకు అందరి హృదయాలను కదిలించాయి. తన తండ్రి కూడా గత సంవత్సరం ఎయిడ్స్‌తో చనిపోయాడని వివరించాడు. తన తండ్రి మరణం తర్వాత, అతని బంధువులు అతనితో మాట్లాడటం మానేశారు. కనీసం ఇంటికి రాలేదు. పలకరించలేదు. ఇప్పుడు తల్లి కూడా అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులకు తెలిపాడు.
“నాన్న మరణం తర్వాత, నేను పాఠశాలకు వెళ్లడం మానేశాను. నేను మాత్రమే నా తల్లిని చూసుకునేవాడిని. బంధువులు మమ్మల్ని విడిచిపెట్టారు. మా మామకు నా తల్లి మరణవార్త తెలియదు” అని ఆ పిల్లవాడు ఏడ్చాడు. తన తల్లికి కాన్పూర్ , ఫరూఖాబాద్‌లోని లోహియా ఆసుపత్రిలో చికిత్స చేయించానని, కానీ ఆమెను కాపాడలేకపోయానని ఆ పిల్లవాడు చెప్పాడు.
ఆసుపత్రి ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, తన తల్లి మరణం తర్వాత ఎవరూ సంఘటనా స్థలానికి రానప్పుడు, ఆ పిల్లవాడు, ఆసుపత్రి ఉద్యోగి సహాయంతో, తన తల్లి మృతదేహాన్ని స్ట్రెచర్‌పై ఒంటరిగా మార్చురీకి తీసుకెళ్లాడు. పోస్ట్‌మార్టం లాంఛనాల సమయంలో పిల్లవాడు ఒంటరిగా ఉన్నాడు. గంటల తర్వాత, వార్త వ్యాపించినప్పుడు, కొంతమంది దూరపు బంధువులు వచ్చారు. దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాస్‌గంజ్‌లో నివసించే అతని మామతో పాటు ఆ పిల్లవాడు తన తల్లి పక్కనే వెళ్లిపోయాడు.
52 ఏళ్ల ఆ మహిళ ఎటాలోని వీరాంగన అవంతి బాయి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతోంది. ఆరోగ్య శాఖ అధికారుల ప్రకారం, ఆమె 2017 లో క్షయవ్యాధికి చికిత్స పొంది ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చింది. ఈసారి ఆ మహిళకు అన్ని ప్రభుత్వ సౌకర్యాలు, HIV చికిత్సకు మద్దతు లభించిందా లేదా అని దర్యాప్తు చేస్తున్నామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..