బ్రిడ్జిపై నుండి దూకేందుకు యత్నం.. రెప్పపాటులో బాలికను కాపాడిన పోలీసులు!

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో, 14 ఏళ్ల బాలిక ప్రాణాలను పోలీసుల నిఘా కాపాడింది. ఆమె బ్రిడ్జిపై నుండి నదిలోకి దూకడానికి ప్రయత్నిస్తుండగా, పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ బృందం ఆమెను గమనించి అప్రమత్తమైంది. ఆ బాలిక వద్దకు వెళ్లి ఆమెతో మాట్లాడుతూనే, ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీశారు.

బ్రిడ్జిపై నుండి దూకేందుకు యత్నం.. రెప్పపాటులో బాలికను కాపాడిన పోలీసులు!
Saves Woman In Deoria,

Updated on: Nov 06, 2025 | 12:26 PM

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో, 14 ఏళ్ల బాలిక ప్రాణాలను పోలీసుల నిఘా కాపాడింది. ఆమె బ్రిడ్జిపై నుండి నదిలోకి దూకడానికి ప్రయత్నిస్తుండగా, పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ బృందం ఆమెను గమనించి అప్రమత్తమైంది. ఆ బాలిక వద్దకు వెళ్లి ఆమెతో మాట్లాడుతూనే, ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీశారు. ఇంతలో, ఒక యువకుడు ఆ అమ్మాయిని కాపాడటానికి బ్రిడ్జి ఫిల్లర్‌పైకి దూకాడు. ఆ అమ్మాయి జారిపడి స్తంభం నుండి వేలాడిందిది. ఇది చూసిన పోలీసు అధికారులు కూడా లోపలికి దూకారు. స్థానికుల సహాయంతో, అమ్మాయిని పైకి లాగారు. అక్కడి నుంచి ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. చివరికి ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆమెను వారికి అప్పగించారు. ఈ సంఘటన రాంపూర్ ఫ్యాక్టరీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగింది.

మంగళవారం (నవంబర్ 4) సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో, సిటీ సిఓ సంజయ్ కుమార్ రెడ్డి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ అభిషేక్ యాదవ్ పోలీసు బృందంతో కలిసి ఓల్డ్ పట్నావ వంతెన సమీపంలోని ప్రాంతంలో గస్తీ తిరుగుతున్నారు. బురఖా ధరించిన ఒక అమ్మాయి వంతెనపై నిలబడి ఏడుస్తూ నదిలోకి దూకడానికి ప్రయత్నించడాన్ని గమనించారు. పరిస్థితి తీవ్రతను గ్రహించిన పోలీసు బృందం వెంటనే రంగంలోకి దిగింది. పోలీస్ అధికారి ఆ బాలికతో ప్రశాంతంగా మాట్లాడి ఆమె మనస్సు మార్చేందుకు ప్రయత్నించారు. ఇంతలో, సంఘటన స్థలంలో ఉన్న పోలీసు అధికారులు, స్థానికుల సహాయంతో, ఆమె దూకడానికి ముందే ఆమెను పట్టుకున్నారు. దీంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు. ఈ హఠాత్ పరిణామంతో షాక్‌కు గురైన బాలికను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఆ తర్వాత ఆ బాలికను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. మహిళా కానిస్టేబుళ్లు ఆశా సరోజ్, సరితా యాదవ్ ఆమెతో మాట్లాడారు. ఆమె నెమ్మదిగా తన పేరును హష్మున్ నిషా అలియాస్ ప్రీతి (14) అని వెల్లడించింది. ఆమె తండ్రి పేరు ముహమ్మద్దీన్ అని, తాను దేవరియాలోని బాల్పూర్ శ్రీనగర్ నివాసి అని చెప్పింది. ఆ అమ్మాయి తన అత్త చాందినితో బయటకు వెళ్లానని, కానీ అకస్మాత్తుగా ఆమె నుండి విడిపోయానని వివరించింది. దారి తప్పిన తర్వాత, పాత పట్నావా వంతెన వద్ద ఆమె పడిపోయింది. మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు.

పోలీసులు అమ్మాయి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఆమె తల్లి సల్మా , కుటుంబసభ్యలు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. తన కూతురు కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకుండా చాలా బాధపడుతుందని సల్మా వివరించింది. ఆమె బిగ్గరగా ఏడుస్తుంది. ఎవరికీ ఏమీ చెప్పదు. బహుశా ఈరోజు కూడా అలాంటిదే జరిగి ఉండవచ్చు, అందుకే ఆమె ఈ ప్రమాదకరమైన చర్యకు పాల్పడి ఉంటుందని బాలిక తల్లి సల్మా తెలిపారు. వైద్య పరీక్షల తర్వాత బాలికను ఆమె కుటుంబానికి అప్పగించారు పోలీసులు. తమ కుమార్తెను సురక్షితంగా కనుగొన్నందుకు తల్లి, కుటుంబ సభ్యులు మొత్తం పోలీసు బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల మానవత్వాన్ని స్థానికులు ప్రశంసించారు. పోలీసులు కొన్ని సెకన్లు ఆలస్యం చేసి ఉంటే, ఒక అమాయకురాలి ప్రాణాలు కోల్పోయేవారు.

వీడియో చూడండి… 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..