ప్రియ(30), ప్రీతి (24).. వీళ్లిద్దరూ లెస్బియన్స్.. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. విషయం బయటకు తెలియకుండా రహస్యంగానే కథ నడిపారు. కానీ, ఏదోలా మ్యాటర్ మొత్తం లీక్ అయ్యింది. ఇక వారిని పెళ్లి చేసుకోవడానికి ఏ అబ్బాయి ముందుకు రాలేదు. పైగా స్థానికంగా సూటిపోటి మాటలు. ఇంకేముంది.. వీరి కారణంగా ఇంట్లోవారికి పరువు పోయినట్లుగా భావించారు. మరోవైపు.. ప్రీతికి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ, ప్రియ అందుకు అందుకు అంగీకరించలేదు. తనతోనే కలిసి ఉండాలని పట్టుబట్టింది. అవసరమైతే తానే అబ్బాయిగా మారుతానంటూ మొండికేసింది. ఈ మ్యాటర్ అంతా ప్రీతి తన ఇంట్లో చెప్పింది. అయితే, అబ్బాయిగా మారుతానంటూ ప్రియ చెప్పిన మాటలను ప్రీతి, ఆమె తల్లి అవకాశంగా మార్చుకున్నారు. ప్రియను వదిలించుకునేందుకు స్కెచ్ వేశారు. చివరకు అనుకున్నంత పని చేశారు. లింగ మార్పిడి పేరుతో అత్యంత కిరాతకంగా చంపించేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని ఆర్‌సి మిషన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ప్రియ(30), ప్రీతి (24) ఇద్దరూ మంచి స్నేహితులు. ఈ స్నేహం కాస్తా స్వలింగ సంపర్కానికి దారితీసింది. ప్రియ.. ప్రీతిపై ప్రేమను పెంచుకుంది. మరోవైపు ప్రీతి.. ప్రియను వదిలించుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే తల్లితో కలిసి పథకం వేసింది. మహ్మదీ ప్రాంతానికి చెందిన ఓ మంత్రగాడితో కలిసి పథకం వేశారు. ప్రియను చంపేందుకు రూ. 1.5 లక్షలు సాపారీ కూడా మాట్లాడుకున్నారు. ఇంకేముంది.. ప్రియ కోరిక మేరకు లింగ మార్పిడి చేస్తామంటూ రప్పించారు. ఓ కొలను ఒడ్డున నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ పూజలు చేస్తున్నట్లుగా నమ్మించి, కళ్లు మూసుకుని పడుకోమని చెప్పారు. అది నమ్మిన ప్రియ.. కళ్లు మూసుకుని నేలపై పడుకుంది. ఇంకేముంది.. కత్తి తీసుకుని ఆమెను దారుణంగా పొడిచి పొడిచి చంపేశారు.
అయితే, ఏప్రిల్ 13న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రియ మళ్లీ తిరిగి ఇంటికి రాలేదు. మూడు రోజుల పాటు తీవ్రంగా గాలించినా ఆచూకి లభించలేదు. దాంతో ప్రియ కుటుంబ సభ్యులు ఏప్రిల్ 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవల ఆమె ఫోన్ కాల్స్, ఇతర టెక్నికల్ ఆధారాలను బేస్ చేసుకుని ప్రియ హత్యకు గురైనట్లు కనిపెట్టారు. లింగ మార్పిడి పేరుతో ప్రియను రప్పించి హత్య చేసినట్లు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..