లవర్‌ను కలవడానికి వెళ్లిన యువకుడు.. కట్ చేస్తే.. గొంతు కోసుకున్న యువతి.. అసలు ఏం జరిగిందంటే..?

ఇద్దరి ప్రేమ వ్యవహారం దారుణమైన హత్యకు దారితీసింది. తన ప్రియురాలు మనీషాను కలవడానికి వెళ్లిన రవి అనే యువకుడిని ఆమె కుటుంబ సభ్యులు పట్టుకున్నారు. ఎందుకొచ్చావంటూ ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన రవి మనీషా మామను కత్తితో పొడిచాడు. వెంటనే కుటుంబసభ్యులు రవిపై కర్రలతో దాడి చేశాడు. ఈ దాడిలో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత ప్రియురాలు ఏం చేసిందంటే..?

లవర్‌ను కలవడానికి వెళ్లిన యువకుడు.. కట్ చేస్తే.. గొంతు కోసుకున్న యువతి.. అసలు ఏం జరిగిందంటే..?
Beaten To Death By Family

Updated on: Oct 30, 2025 | 1:03 PM

ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో ప్రేమ వ్యవహారం దారుణమైన హత్యకు దారితీసింది. తన ప్రియురాలిని కలవడానికి రహస్యంగా వెళ్లిన యువకుడిని ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటనలో యువతి మామ కత్తి పోట్లతో గాయపడగా, ఆ యువతి కూడా ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ షాకింగ్ సంఘటన జిల్లాలోని మౌదహా పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్చ్ గ్రామంలో జరిగింది.

బందా జిల్లాలోని జస్పురా గ్రామానికి చెందిన రవి.. తన ప్రియురాలు మనీషాను కలవడానికి పర్చ్ గ్రామానికి వెళ్లాడు. రవి, మనీషా కలిసి మాట్లాడుకుంటుండగా.. మనీషా మామ పింటు వారిని గమనించాడు. దీంతో పింటు, రవితో గొడవకు దిగాడు. ఆగ్రహించిన రవి తన దగ్గర ఉన్న కత్తితో పింటు కడుపులో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. పింటు అరుపులు విని కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబసభ్యులు.. రవిపై కర్రలతో దారుణంగా దాడి చేశారు.

ఈ దాడిలో రవికి తీవ్ర రక్తస్రావం అవ్వగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఘర్షణ తర్వాత కుటుంబ సభ్యులు గాయపడిన మామ పింటును చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రేమికుడు రవి మరణించిన విషయం తెలుసుకున్న మనీషా తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో పదునైన ఆయుధంతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు వెంటనే మనీషాను మౌదాహాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం సదర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడిలో గాయపడిన ఉమాశంకర్ ఆస్పత్రికి తరలించేలోపే మరణించాడని ఎస్పీ దీక్షాశర్మ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..