ప్రభుత్వ ఆసుపత్రిలో ఏక్‌దమ్ మందు పార్టీ.. వీడియో వైరల్‌తో బయటపడ్డ భాగోతం!

ఒకవైపు, గత పదేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు మారిపోయాయని ప్రభుత్వం చెబుతుండగా, మరోవైపు, అదే ప్రభుత్వ ఆసుపత్రుల నుండి వెలువడుతున్న చిత్రాలు.. అసలు భాగోతాన్ని బహిర్గతం చేస్తున్నాయి. తాజా సంఘటన వారణాసిలోని జిల్లా ఆసుపత్రికి సంబంధించినది. ఇక్కడ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జిల్లా ఆసుపత్రిలోని పాథాలజీ విభాగం సిబ్బంది విధి నిర్వహణలో కాక్‌టెయిల్ పార్టీ చేసుకున్నట్లు కనిపించింది.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఏక్‌దమ్ మందు పార్టీ.. వీడియో వైరల్‌తో బయటపడ్డ భాగోతం!
Alcohol Drinking In Hospital Lab

Updated on: Mar 15, 2026 | 1:19 PM

ఒకవైపు, గత పదేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు మారిపోయాయని ప్రభుత్వం చెబుతుండగా, మరోవైపు, అదే ప్రభుత్వ ఆసుపత్రుల నుండి వెలువడుతున్న చిత్రాలు.. అసలు భాగోతాన్ని బహిర్గతం చేస్తున్నాయి. తాజా సంఘటన వారణాసిలోని జిల్లా ఆసుపత్రికి సంబంధించినది. ఇక్కడ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జిల్లా ఆసుపత్రిలోని పాథాలజీ విభాగం సిబ్బంది విధి నిర్వహణలో కాక్‌టెయిల్ పార్టీ చేసుకున్నట్లు కనిపించింది. పాథాలజీ ల్యాబ్‌లోనే ఆసుపత్రి సిబ్బంది మద్యం, చికెన్ పార్టీని చేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో త్వరగా వైరల్ కావడంతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.

ఈ వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత దర్యాప్తుకు ఆదేశించినట్లు జిల్లా ఆసుపత్రి CMS డాక్టర్ ఆర్ఎస్ రామ్ తెలిపారు. వీడియోను పరిశీలించి, అందులో పాల్గొన్న ఉద్యోగులను గుర్తించారు. ఈ వీడియో పాతదని, గత సంవత్సరం జూన్-జూలై నాటిదని, ఆ సమయంలో తాను అక్కడ లేనని ఆయన అన్నారు. అయితే, ఆసుపత్రి ప్రతిష్ట, క్రమశిక్షణ ప్రమాదంలో ఉంది. ఇలాంటి చర్యలను ఉపేక్షించేదీ లేదన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని CMS డాక్టర్ అన్నారు.

జిల్లా ఆసుపత్రిలోని ప్రాంతీయ రోగ నిర్ధారణ కేంద్రం రోగులకు రక్త నమూనా సేకరణ, వైద్య పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను అందిస్తారు. రోగులకు వారి నమూనాల తర్వాత నివేదికలు అందించడం జరుగుతుంది. ఈ వైరల్ వీడియో తర్వాత, ఆసుపత్రి యాజమాన్యం ఉద్యోగులను గుర్తించడానికి ప్రయత్నిస్తోంది. ఒక కమిటీ వీడియోను దర్యాప్తు చేసి పార్టీలో పాల్గొన్న ఉద్యోగులను గుర్తిస్తుంది.

ఈ వీడియోలో ఆసుపత్రి పాథాలజీ విభాగంలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు, శాంప్లింగ్ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆసుపత్రి సమగ్రతను విస్మరిస్తున్న ఈ వ్యక్తులు ఎవరో నిర్ధారించడం దర్యాప్తు కమిటీపై ఆధారపడి ఉంటుంది. వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత దర్యాప్తుకు ఆదేశించినట్లు జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMS) డాక్టర్ ఆర్ఎస్ రామ్ తెలిపారు. వీడియోను పరిశీలించి ఉద్యోగులను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us