AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: ఓ ఇంట్లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి.. శిథిలాల కింద చిక్కుకున్న మరికొందరు..!

ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అయోధ్య జిల్లాలోని పురా కలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాగ్లా భారీ గ్రామంలో గురువారం (అక్టోబర్ 9) రాత్రి ఒక ఇంట్లో పేలుుడు సంభవించింది. శక్తివంతమైన పేలుడు ధాటికి ఇల్లు కుప్పకూలిపోయింది, శిథిలాల కింద చిక్కుకుని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

Ayodhya: ఓ ఇంట్లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి.. శిథిలాల కింద చిక్కుకున్న మరికొందరు..!
Explosion In House In Ayodhya
Balaraju Goud
|

Updated on: Oct 09, 2025 | 9:30 PM

Share

ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అయోధ్య జిల్లాలోని పురా కలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాగ్లా భారీ గ్రామంలో గురువారం (అక్టోబర్ 9) రాత్రి ఒక ఇంట్లో పేలుుడు సంభవించింది. శక్తివంతమైన పేలుడు ధాటికి ఇల్లు కుప్పకూలిపోయింది, శిథిలాల కింద చిక్కుకుని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. పేలుడు గురించి సమాచారం అందిన వెంటనే, SSP, CO సహా పలువురు సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

జేసీబీని ఉపయోగించి శిథిలాలను తొలగిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో బాణసంచా పేలుడు సంభవించిందని తెలుస్తోంది. అయితే పోలీసులు, స్థానిక అధికారులు ఈ విషయంపై ఇంకా ఎటువంటి సమాచారం అందించలేదు. సంఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తున్నప్పుడు, పోలీసులు పేలిన సిలిండర్, కుక్కర్‌ను కనుగొన్నారు. ఈ సంఘటన తర్వాత ఐదుగురిని ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఐదుగురు మరణించారని, మృతుల్లో ముగ్గురు పిల్లలు, మరో ఇద్దరు ఉన్నారని పోలీసులు తెలిపారు. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు సహాయ బృందాలు శ్రమిస్తున్నాయి. కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.

కలందర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పాగ్లా భారీ గ్రామానికి చెందిన రామ్‌కుమార్ అలియాస్ పరస్నాథ్ గ్రామం వెలుపల తాను నిర్మించుకున్న ఇంట్లో నివసిస్తున్నాడు. గురువారం రాత్రి అతని ఇల్లు పెద్ద పేలుడుతో కూలిపోయింది. శబ్దం విన్న చుట్టుపక్కల ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, ఎస్‌ఎస్‌పి డాక్టర్ గౌరవ్ గ్రోవర్, ఎస్పీ సిటీ చక్రపాణి త్రిపాఠి, సిఓ అయోధ్య కూడా పోలీసు బృందంతో వచ్చారు.

ఆధారాల ప్రకారం, పేలుడుకు కారణం బాణాసంఛా అని భావిస్తున్నారు. ఇంట్లో నిల్వ చేసిన పటాకుల మధ్య గ్యాస్ సిలిండర్ లీక్ కావడం వల్ల భారీ పేలుడు సంభవించింది. సంఘటనా స్థలంలో పేలిన సిలిండర్‌ను పోలీసులు కనుగొన్నందున గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే, ఇది ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
అబ్బబ్బో.. వీటిని టేస్ట్ చేస్తే వదిలి పెట్టరు.. మీరు ట్రై చేయండి!
అబ్బబ్బో.. వీటిని టేస్ట్ చేస్తే వదిలి పెట్టరు.. మీరు ట్రై చేయండి!
పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచే మఖానా దోశలు.. ఎలా చేయాలంటే?
పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచే మఖానా దోశలు.. ఎలా చేయాలంటే?
రక్తం ఇస్తే డబ్బులిచ్చే కుర్చీ..OTTలో భయపెడుతోన్న తెలుగు సినిమా
రక్తం ఇస్తే డబ్బులిచ్చే కుర్చీ..OTTలో భయపెడుతోన్న తెలుగు సినిమా
తేడాగా ఉందని ఆపి చెక్ చేశారు! లోపల స్పెషల్ రూమ్.. అందులో..
తేడాగా ఉందని ఆపి చెక్ చేశారు! లోపల స్పెషల్ రూమ్.. అందులో..
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో