ఇలా తయారయ్యారేంట్రా బాబూ..! పోక్సో కేసుతో జైలు పాలైన ఇద్దరు పిల్లల తల్లి..!

ఇదో విచిత్ర కేసు.. కుటుంబ సంబంధాల విలువలను ప్రశ్నార్థకం చేసిన ఒక సంచలనాత్మక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో ని అలీగఢ్ జిల్లాలోని ఇగ్లాస్ కోత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఇద్దరు పిల్లల తల్లి అయిన 40 ఏళ్ల మహిళ, తన 17 ఏళ్ల మైనర్ మేనల్లుడితో అక్రమ సంబంధం కొనసాగించింది. అంతేకాదు, అతడిని బెదిరింపులకు గురిచేసి రెండున్నర సంవత్సరాల పాటు లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇలా తయారయ్యారేంట్రా బాబూ..! పోక్సో కేసుతో జైలు పాలైన ఇద్దరు పిల్లల తల్లి..!
Represantive Image

Updated on: Jun 23, 2026 | 2:28 PM

ఇదో విచిత్ర కేసు.. కుటుంబ సంబంధాల విలువలను ప్రశ్నార్థకం చేసిన ఒక సంచలనాత్మక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో ని అలీగఢ్ జిల్లాలోని ఇగ్లాస్ కోత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఇద్దరు పిల్లల తల్లి అయిన 40 ఏళ్ల మహిళ, తన 17 ఏళ్ల మైనర్ మేనల్లుడితో అక్రమ సంబంధం కొనసాగించింది. అంతేకాదు, అతడిని బెదిరింపులకు గురిచేసి రెండున్నర సంవత్సరాల పాటు లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

బాధిత బాలుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, మహిళ గత రెండున్నర సంవత్సరాలుగా మైనర్‌ను మానసికంగా, శారీరకంగా వేధిస్తూ అతనితో సంబంధం కొనసాగించేందుకు బలవంతం చేసేది. తన మాట వినకపోతే తప్పుడు అత్యాచార కేసులో ఇరికించి జైలుకు పంపిస్తానని తరచూ బెదిరించేదని బాలుడు వెల్లడించాడు. కుటుంబ పరువు, సామాజిక అవమానం భయంతో అతడు ఇన్నాళ్లు ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పలేక మౌనంగా భరించాడు. అయితే ఇటీవల ఆ మహిళ తనను వివాహం చేసుకోవాలని, జీవితాంతం తనతోనే ఉండాలని మైనర్‌పై ఒత్తిడి పెంచడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. దీంతో భయాందోళనకు గురైన బాలుడు జరిగిన విషయాన్ని తన తల్లికి వివరించాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.

విషయం గ్రామంలో పెద్ద చర్చకు దారితీయడంతో, పోలీసుల సమక్షంలో గ్రామ పంచాయతీ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో మహిళ భర్తతో పాటు బంధువులు ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించారు. భర్త ఆమెను తిరిగి కుటుంబంలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆమె మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తాను ఇకపై మైనర్ మేనల్లుడితోనే జీవిస్తానని అందరి ముందూ తేల్చి చెప్పేసింది. అంతేకాకుండా, పంచాయతీ సమావేశంలో తాను రెండున్నర నెలల గర్భవతినని, గర్భంలోని బిడ్డకు ఆ మైనర్ బాలుడే తండ్రి అని బహిరంగంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినా ఆమె తన పట్టుదలను వీడలేదు.

దీంతో బాధిత బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్‌ను వైద్య పరీక్షల కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని, ఆమెపై పోక్సో చట్టంతో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us