చైనా నుంచి భారత్‌ను దూరం చేస్తాం..! అమెరికా రాయబారి సంచలన వ్యాఖ్యలు

అమెరికా రాయబారి సెర్గియో గోర్, భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవడం తమ ప్రధాన లక్ష్యమని, చైనా నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. భారత్, అమెరికా మధ్య కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, వాటిని పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. అమెరికా, భారత్‌ల మధ్య దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని, చైనాతో పోలిస్తే చాలా బలమైనవని గోర్ వివరించారు.

చైనా నుంచి భారత్‌ను దూరం చేస్తాం..! అమెరికా రాయబారి సంచలన వ్యాఖ్యలు
Pm Modi And Jinping And Don

Updated on: Sep 12, 2025 | 8:11 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినీ, భారత్‌లో అమెరికా రాయబారిగా ఉన్న సెర్గియో గోర్ గురువారం సెనేట్ విదేశాంగ సంబంధాల కమిటీతో మాట్లాడుతూ.. భారత్‌ సంబంధాలను బలోపేతం చేసుకోవడం తమ మొదటి ప్రాధాన్యత అని అన్నారు. అలాగే భారత్‌ను తమ వైపుకు తీసుకురావడంతో పాటు చైనా నుంచి దూరం చేయడం తమ లక్ష్యమని తెలిపారు. అమెరికా, భారత్‌ కొన్ని తాత్కాలిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని ఆయన అంగీకరించారు. కానీ వాటిని పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. రెండు దేశాల మధ్య దీర్ఘకాలికంగా, లోతైన సంబంధాలను గోర్ గుర్తు చేశారు.

భారత్‌తో అమెరికా బంధం, చైనాతో భారత్‌ సంబంధాల కంటే చాలా బలమైందని అభివర్ణించారు. భారత ప్రభుత్వంతో, భారత ప్రజలతో మా సంబంధం చాలా దశాబ్దాలుగా కొనసాగుతోంది, ఇది చైనీయులతో వారికి ఉన్న దానికంటే చాలా వెచ్చని సంబంధం.. చైనా విస్తరణవాదం భారతదేశ సరిహద్దులోనే కాదు, అది ఆ ప్రాంతమంతా ఉంది” అని ఆయన ఆరోపించారు. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా భారత్‌, రష్యాలను అత్యంత లోతైన, చీకటి చైనా చేతిలో కోల్పోయిందని పేర్కొన్నారు.

టియాంజిన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఉన్న ఫోటోను ట్రంప్ ట్రూత్ సోషల్‌లో షేర్ చేస్తూ.. మనం భారత్‌, రష్యాను లోతైన, చీకటి చైనా చేతిలో కోల్పోయినట్లు కనిపిస్తోంది. వారికి సుదీర్ఘమైన, సంపన్నమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను” అని రాశారు .

భారత్-అమెరికా సుంకాల ఒప్పందం

ఈ సుంకాలపై అమెరికా, భారత్‌ మధ్య వీలైనంత త్వరలోనే ఒప్పందం కుదురుతుందని సెర్గియో గోర్ అన్నారు. రష్యా ఇంధన కొనుగోళ్లకు సంబంధించి దేశాలను శిక్షించడానికి భారత్‌, చైనాపై సుంకాలను పెంచాలని డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ నాయకులపై ఒత్తిడి తెస్తున్నప్పటికీ, భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకాలకు సంబంధించి భారత్‌, అమెరికా మధ్య ఉన్న సమస్యను కొన్ని వారాల్లో పరిష్కరించాలని గోర్ అన్నారు. రష్యా చమురుపై ఆధారపడటాన్ని తగ్గించుకునేలా భారత్‌ను ఒప్పించడం అనే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటైన గోర్ కూడా ప్రస్తావించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి