Viral Video: ‘వీడెవడండీ బాబూ’.. రెండో పెళ్లి కోసం అలిగి వాటర్‌ ట్యాంక్‌ ఎక్కాడు! ఆ తర్వాత సీన్‌ ఇదే..

ఒక్క భార్యతోనే వేగలేక నానాతంటాలు పడుతుంటే.. ఓ ప్రబుద్ధుడు రెండో పెళ్లం కావాలంటూ నానారచ్చ చేశాడు. పైగా తనకు ఠంఛన్‌గా రెండో పెళ్లి చేయకుంటే చస్తానని ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న వాటర్‌ ట్యాంక్‌పైకి ఎక్కి చల్‌చల్‌ చేశాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారియి.

Viral Video: వీడెవడండీ బాబూ.. రెండో పెళ్లి కోసం అలిగి వాటర్‌ ట్యాంక్‌ ఎక్కాడు! ఆ తర్వాత సీన్‌ ఇదే..
Man Climbs Water Tank In Desire For Second Wife

Updated on: Jan 07, 2026 | 6:31 PM

లక్నో, జనవరి 7: ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో జనవరి 1న ఇస్లాంనగర్‌కు చెందిన హర ప్రసాద్ మౌర్య అనే వ్యక్తి రెండో పెళ్లి చేయలంటూ పట్టుబట్టాడు. అంతేనా.. స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న 30 అడుగుల ఎత్తైన వాటర్‌ ట్యాంకుపైకి ఎక్కి అలిగి కూర్చున్నాడు. తనకు వెంటనే పెళ్లి చేసి రెండో భార్య తీసుకురావాలని డిమాండ్‌ చేశాడు. లేదంటే అక్కడి నుంచి దూకి చస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో ఆసుపత్రి వద్ద గందరగోళం నెలకొంది.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులు హర ప్రసాద్‌తో మాట్లాడగా అతడు.. ‘సార్, నేను 10 రోజులుగా ఇదే మురికి బట్టలు వేసుకుంటున్నాను. వీటిని ఎవరు ఉతుకుతారు? అందరికీ భార్యలు ఉన్నారు. నాకు కూడా ఒక భార్య కావాలి. నా మొదటి భార్య నన్ను వదిలేసింది. మీరు నాకు రెండవ భార్యను ఇవ్వకపోతే, నేను ఇక్కడి నుంచి దూకి చనిపోతా’ అని బెదిరించాడు. దీంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆసక్తిగా తిలకించసాగారు. దీంతో పోలీసులు సుమారు 30 నిమిషాల పాటు హర ప్రసాద్‌కు నచ్చజెప్పెందుకు ప్రయత్నించారు. చివరకు అతడిని ఎలాగోలా ఒప్పించి కిందకు దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అతని కుటుంబ సభ్యుల సమక్షంలో వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లి, తరువాత వారికి అప్పగించారు. హర్ ప్రసాద్ తల్లిదండ్రులు మున్నా లాల్ మౌర్య, రామ్ ప్యారి పోలీసులతో మాట్లాడుతూ..

ఇవి కూడా చదవండి

తమ కుమారుడు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిపారు. బరేలీలో చికిత్స పొందుతున్నామని, తమ కొడుకుకి ఎనిమిదేళ్ల కిందట వివాహం కాగా ఆరేళ్ల క్రితం భార్య అతడిని విడిచి వెళ్లిపోయిందని తెలిపారు. ప్రస్తుతం ఆరేళ్ల కుమారుడితో హర్ ప్రసాద్ ఉంటున్నట్లు వివరించారు. హర్ ప్రసాద్ ఇటీవలే జలంధర్ నుండి తిరిగి వచ్చాడని, అక్కడ అతను దినసరి కూలీగా పనిచేస్తున్నట్లు తెలిపారు. అతనిపై నిఘా ఉంచాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా క్రమం తప్పకుండా వైద్య సహాయం అందించాలని పోలీసులు కుటుంబ సభ్యులకు సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైలర్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.