Traffic Jam Kanpur: ఘోరం.. ట్రాఫిక్‌లో చిక్కుకుని నొప్పితో అల్లాడిపోయిన ఇద్దరు రోగులు.. ఆసుపత్రికి చేరుకునేలోపే..

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాన్పూర్‌లో 2 కిలోమీటర్ల పొడవైన ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని 2 రోగులు మరణించారు. సచేండి పోలీసులు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధుడిని కారులో హాలెట్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. హాలెట్ వంతెనపై ఉన్న జామ్‌లో వాహనం చిక్కుకుంది. గాయపడిన వ్యక్తి నొప్పితో మెలికలు తిరుగుతూ 25 నిమిషాల్లో మరణించాడు. అదే సమయంలో మరో ఆటో రిక్షా కూడా జామ్‌లో చిక్కుకుంది. అందులో ఒక రోగి కూడా ఉన్నాడు. ఆసుపత్రికి చేరుకునేలోపు ఆటో రిక్షాలో ఉన్న రోగి ఊపిరి కూడా ఆగిపోయింది.

Traffic Jam Kanpur: ఘోరం.. ట్రాఫిక్‌లో చిక్కుకుని నొప్పితో అల్లాడిపోయిన ఇద్దరు రోగులు.. ఆసుపత్రికి చేరుకునేలోపే..
Kanpur Traffic Jam Claims L

Updated on: Sep 03, 2025 | 10:19 AM

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక పోలీసు వాహనం రెండు కిలోమీటర్ల పొడవైన ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంది. ఒక ఆటోరిక్షా కూడా ఇదే విధంగా ఆ జామ్‌లో ఇరుక్కుపోయింది. రెండు వాహనాల్లోనూ ఇద్దరు రోగులు ఉన్నారు. వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే రోడ్డు జామ్ కారణంగా.. రెండు వాహనాలు ఎంత ప్రయత్నించినా ముందుకు కదలలేకపోయాయి. ఆసుపత్రికి చేరుకునేలోపే ఇద్దరూ మరణించారు.

సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో శుక్లాగంజ్ నివాసి మున్నాకు ఛాతీ నొప్పిగా ఉందని తనవారికి చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆటో బుక్ చేసుకుని కార్డియాలజీ ఆసుపత్రిలో చేర్పించడానికి ఇంటి నుంచి బయలుదేరారు. ఆటో LLR మెట్రో స్టేషన్ చేరుకున్నప్పుడు.. ఆటో ట్రాపిక్ లో చిక్కుకుపోయింది. అప్పుడు మున్నా ఆటోలో ఛాతీ నొప్పిగా ఉందంటూ విలవిలాడుతుంటే.. అతనితో ఉన్న కుటుంబ సభ్యులు అతని ఛాతీని తడుముతూ ఓదార్చారు.. అస్పత్రికి వెళ్తాం.. మీకు ఏమీ కాదంటూ దైర్యం చెప్పారు.

అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు

ఇవి కూడా చదవండి

ఎంతకీ ట్రాపిక్ క్లియర్ కాకపోవడం, రద్దీ తగ్గకపోవడంతో ఆ కుటుంబంలోని ఒక యువకుడు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ప్రయత్నించడం ప్రారంభించాడు. ఎట్టకేలకు కుటుంబ సభ్యులు మున్నాని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే మున్నా చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. ట్రాఫిక్ జామ్ వలన ఆటో ఒక కి.మీ దూరం ప్రయాణించడానికి సుమారు 30 నిమిషాలు పట్టింది. సాధారణంగా ఈ దూరం ఆటోలో వెళ్తే.. 10-15 నిమిషాలు పడుతుంది. చికిత్స లేట్ అయ్యే సరికి మున్నా కన్నుమూశాడు.

పోలీసు వాహనంలో గాయపడిన వ్యక్తి మృతి

అదే సమయంలో సచేండి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని జరిగిన సంఘటనపై కానిస్టేబుల్ ముఖేష్ యాదవ్, అజిత్ కుమార్ మాట్లాడుతూ.. దీపు చౌహాన్ ధాబా సమీపంలో రోడ్డు దాటుతున్న ఒక వృద్ధుడిని వాహనం ఢీకొట్టిందని చెప్పారు. అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే డయల్-122కు సమాచారం అందించారు. ఆ తర్వాత PRVలో ఉన్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. PRV ఆ వృద్ధుడితో హాల్ట్ వైపు తీసుకుని వెళ్తుండగా.. పోలీసు వాహనం LLR మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంది. సకాలంలో చికిత్స అందకపోవడంతో వృద్ధుడు కూడా విలవిలడుతూ మరణించాడు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..