యోగీ వార్నింగ్.. ప్రజా ఆస్తిని ధ్వంసం చేశారో.. ఇక మీ ఆస్తులన్నీ..

| Edited By:

Dec 20, 2019 | 4:51 AM

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దేశ వ్యాప్తంగా పలువురు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులను ఆందోళనకారులు ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న వారిపై యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజాస్వామ్యం ముసుగులో విధ్వంసం సృష్టిస్తే సహించేది లేదన్నారు. అలా ఎవరు చేసినా.. వారి ఆస్తులన్నీ జప్తు చేస్తామని హెచ్చరించారు. జరిగిన నష్టాన్ని మొత్తం వారి నుంచే వసూలు […]

యోగీ వార్నింగ్.. ప్రజా ఆస్తిని ధ్వంసం చేశారో.. ఇక మీ ఆస్తులన్నీ..
Follow us on

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దేశ వ్యాప్తంగా పలువురు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులను ఆందోళనకారులు ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న వారిపై యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజాస్వామ్యం ముసుగులో విధ్వంసం సృష్టిస్తే సహించేది లేదన్నారు. అలా ఎవరు చేసినా.. వారి ఆస్తులన్నీ జప్తు చేస్తామని హెచ్చరించారు. జరిగిన నష్టాన్ని మొత్తం వారి నుంచే వసూలు చేస్తామని సీఎం యోగి స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ.. రాష్ట్రంలోని లక్నో తదితర ప్రాంతాల్లో ఆందోళన కారులు తీవ్ర విధ్వంసం సృష్టించారు. ఓ ప్రాంతంలో ఏకంగా పోలీస్ స్టేషన్‌ను తగలబెట్టారు. ఈ నేపథ్యంలో సీఎం యోగిపై ఈ హెచ్చరికలు చేశారు.

కాగా, నిరసనల పేరుతో హింసకు పాల్పడిన వారి వీడియోలు తీశామని, సీసీటీవీ ఫుటేజీ విజువల్స్ ఆధారంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో నవంబర్‌ 8 నుంచి నిషేధాజ్ఞలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని, ఎలాంటి ప్రదర్శన నిర్వహించాలన్నా పర్మిషన్ తప్పనిసరని తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం విషయంలో.. విపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు.