
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని NH-34లో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. రన్నింగ్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఖుర్జా దేహత్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారి 34పై ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 80 మంది ప్రయాణికులతో బస్సు దాద్రి నుండి హర్దోయ్‌కు వెళ్తుండగా బులంద్‌షహర్ వద్దకు రాగానే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును ఆపేశాడు. తర్వాత బస్సులో ఉన్న ప్రయాణికులందరిని కిందకు దించాడు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. ఇక రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది చాలా సేపు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. కానీ ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్దమై పోయింది. ఈ మంటల్లో ప్రయాణికులకు సంబంధించి లగేజ్ కూడా కాలిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై ప్రయాణికులు కీలక విషయాలను తెలిపారు. బస్సు వేడెక్కడం వల్ల రెండు చోట్ల ఆపారని, కానీ మరమ్మతులు చేయకుండా, దానిని నడిపారని తెలిపారు. వేడెక్కిన ఇంజిన్ బస్సుకు మంటలు అంటుకున్నట్టు తెలిపారు.
బస్సులో మంటలు చెలరేగడంతో భయపడిపోయిన కొంతమంది ప్రయాణికులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి రన్నింగ్ బస్సు నుండి దూకారు. ఒక ప్రయాణీకుడు కిటికీ పగలగొట్టి బయటకు వచ్చానని చెప్పాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందని అతను ఆరోపించాడు. బస్సులో ఇంధనం లేదు, దీని వల్ల బస్సులు ఇంజన్ వేడెక్కింది. అయినా కూడా డ్రైవర్ బస్సును అలాగే నడిపాడని వారు చెప్పుకొచ్చారు.
ఇక ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకుండానే బస్సు హైవేపై నడుస్తున్నట్టు గుర్తించారు. ఆపై రోడ్డుపై నుంచి బస్సును తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH | Uttar Pradesh: Fire broke out in a bus on NH34 in the Khurja Dehat police station area of Bulandshahr.
CFO Pramod Kumar Sharma says, “We received information about a bus catching fire around 9.15 PM. The bus was travelling from Delhi to Hathras. The fire has been… pic.twitter.com/dSKqJdceGl
— ANI (@ANI) October 18, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.