బిగ్‌ అలెర్ట్‌.. రూ.2 వేల నోట్లపై RBI కీలక ప్రకటన!

2016 నవంబర్ 8 నోట్ల రద్దు తర్వాత, రూ.2000 నోట్లు చెలామణిలోకి వచ్చాయి. తాజాగా, ఆర్బీఐ రూ.6181 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఇంకా ప్రజల వద్ద ఉన్నాయని ప్రకటించింది. ఈ నోట్లను ఎంచుకున్న పోస్టాఫీసుల ద్వారా మార్చుకోవచ్చు. 98.26% నోట్లు మాత్రమే తిరిగి వచ్చాయి.

బిగ్‌ అలెర్ట్‌.. రూ.2 వేల నోట్లపై RBI కీలక ప్రకటన!
2 Thousand Rupees Notes

Updated on: Jun 02, 2025 | 5:51 PM

2016 నవంబర్‌ 8న నోట్ల రద్దుతో కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. నల్లధనం అరికట్టడంతో పాటు, ఉగ్రవాదులకు నిధులు చేరకుండా ఉండేందకు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. రద్దు చేసిన నోట్ల స్థానంలో కొత్తగా రూ.2 వేలు, రూ.500 నోట్లు ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో రూ.2 వేల నోట్లు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి, వాటిని బ్యాంకుల్లో మార్చుకోవాలని సూచించింది. నిదానంగా రూ.2 వేల నోటును చెలామణి నుంచి తప్పించి, వాటి ముద్రణ కూడా నిలిపివేసింది.

అయితే.. తాజాగా ఆర్బీఐ మరో కీలక ప్రకటన చేసింది. రూ. 2 వేల నోట్లు 100 శాతం ఆర్బీఐకి రిటర్న్‌ కాలేదని స్పష్టం చేసింది. ఇంకా ప్రజల వద్దే రూ.6,181 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయని పేర్కొంది. వాటిని ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో మార్చుకోవచ్చని కూడా వెసులుబాటు ఇచ్చింది. 98.26 శాతం నోట్లు మాత్రమే తిరిగి వచ్చాయి ఆర్బీఐ తెలిపింది. మరి ఇంకా రూ.2 వేల నోటు మీ వద్ద ఉన్నట్లయితే.. వెంటనే పోస్టాఫీసుకు వెళ్లి అక్కడ మార్చుకునే వీలుంటే మార్చుకోండి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి