అన్‌లాక్ 5 నిబంధనలు న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు పొడిగింపు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. కానీ, కొత్తగా నమోదు అవుతున్న కేసులతో సమానంగా కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. అయినప్పటికీ, కొవిడ్ నియంత్రణలో భాగంగా కేంద్రం నిబంధనలు పాటించాలని సూచిస్తోంది.

అన్‌లాక్ 5 నిబంధనలు న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు పొడిగింపు

Updated on: Oct 27, 2020 | 4:49 PM

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. కానీ, కొత్తగా నమోదు అవుతున్న కేసులతో సమానంగా కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. అయినప్పటికీ, కొవిడ్ నియంత్రణలో భాగంగా కేంద్రం నిబంధనలు పాటించాలని సూచిస్తోంది. కొవిడ్ నేప‌థ్యంలో అన్‌లాక్ 5 నిబంధ‌న‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం మరోసారి పొడిగించింది. ఆ మార్గ‌ద‌ర్శ‌కాలు న‌వంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు వ‌ర్తిస్తాయ‌ని మంగళవారం కేంద్ర హోంశాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్‌, స్పోర్ట్స్ ట్రైనింగ్ కేంద్రాల‌ను ష‌ర‌తుల‌తో ఓపెన్ చేసేందుకు సెప్టెంబ‌ర్ 30వ తేదీన కేంద్రం అనుమ‌తి ఇచ్చింది. అయితే, ఆ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను న‌వంబ‌ర్ చివ‌రినాటి వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ఇవాళ కేంద్రం హోంశాఖ స్ప‌ష్టం చేసింది. కంటెన్మెంట్ జోన్ల‌లో మాత్రం లాక్‌డౌన్‌ను క‌ఠినంగా అమ‌లు చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ఆదేశించింది. అలాగే, రెండు రాష్ట్రాల మ‌ధ్య అంతర్రాష్ట్ర రాక‌పోక‌ల విష‌యంలో ఎటువంటి నిబంధ‌న‌లు లేవ‌ని తేల్చి చెప్పింది. ఆ రాక‌పోక‌ల‌కు ఎటువంటి ప‌ర్మిష‌న్‌-అనుమ‌తి అవ‌స‌రం లేదని వెల్లడించింది.

ఇక, సినిమా హాల్స్ లో 50 శాతం ఆక్యుపెన్సీకి అనుమ‌తి ఇస్తూ సెప్టెంబ‌ర్ 30వ తేదీన కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అయితే, కొన్ని రాష్ట్రాలు ఇప్ప‌టికే సినిమాహాళ్ల‌కు అనుమతులిచ్చాయి. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం థియేట‌ర్ల‌ను అనుమతి ఇచ్చేందుకు నిరాకరించాయి. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి జనం బయటపడుతుండటంతో జనసమర్థం ఎక్కువైతే మళ్లీ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో నిబంధనలు విధించారు. కాగా, ప్ర‌స్తుతం అక్టోబ‌ర్ నిబంధ‌న‌ల‌నే మరోసారి పొడిగించ‌డం వ‌ల్ల థియేట‌ర్ల యాజ‌మాన్యం ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..