బ్రేకింగ్: అన్‌లాక్ 3.0: సినిమా హాళ్లు, జిమ్‌లకు అనుమతి.. వాటిపై నిషేధం!

| Edited By:

Jul 26, 2020 | 7:49 PM

దేశవ్యాప్తంగా ఈ నెల 31తో అన్‌లాక్‌ 2.0 ముగియనున్న నేపథ్యంలో.. అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.

బ్రేకింగ్: అన్‌లాక్ 3.0: సినిమా హాళ్లు, జిమ్‌లకు అనుమతి.. వాటిపై నిషేధం!
Follow us on

దేశవ్యాప్తంగా ఈ నెల 31తో అన్‌లాక్‌ 2.0 ముగియనున్న నేపథ్యంలో.. అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఆగష్టు 1 నుంచి సినిమా హాళ్లు, జిమ్‌లు తెరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే స్కూళ్లు, మెట్రో రైళ్లపై ఆంక్షలు కొనసాగనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే సినిమా హాళ్లు తెరిచేందుకు ఇప్పటికే కేంద్ర సమాచార ప్రసారాల శాఖ, హోంశాఖను సిఫారసు చేసింది. అంతకుముందు థియేటర్‌ యాజమాన్యాలతో కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సంప్రదింపులు జరిపింది. ఈ నేపథ్యంలో భౌతిక దూరం నిబంధనలను పాటిస్తూ.. 50శాతం సీటింగ్ సామర్థ్యంతో తెరిచేందుకు థియేటర్ యాజమాన్యాలు అంగీకరించాయి. అయితే తొలుత 25శాతం సీటింగ్ తో ప్రారంభించాలని మంత్రిత్వ శాఖ సూచించింది. అలాగే ప్రతి షోకు సీట్ల శానిటైజేషన్‌ చేయాలని సూచించారు.

ఇక స్కూళ్లు తెరిచే విషయంలో మానవ వనరుల  అభివృద్ధి  మంత్రిత్వ శాఖ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపింది. ఈ సందర్భంగా విద్యా సంస్థలు, రాష్ట్రాలు, తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాన్ని సేకరించాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల్ని పంపేందుకు తల్లిదండ్రులు సుముఖంగా లేకపోవడంతో స్కూళ్లు తెరుచుకునేందుకు మరింత సమయం పట్టనుంది. మరోవైపు కంటైన్‌మెంట్‌ జోన్లలో యథాతథంగా కఠిన నిబంధనలను అమలు చేయనున్నట్లు సమాచారం.

Read This Story Also: కరోనా మృతుల అంత్యక్రియలు.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం