కరోనా మృతుల అంత్యక్రియలు.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

ఒక్కోచోట కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

కరోనా మృతుల అంత్యక్రియలు.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2020 | 7:13 PM

ఒక్కోచోట కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులో కరోనాతో మరణించిన వారి అంత్యక్రియల ఫీజులను మాఫీ చేస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ ఖర్చును నగర పౌర సంస్థ భరిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ఇకపై కరోనాతో మరణించిన వారి కుటుంబాలు నగరంలోని 12 విద్యుత్ శ్మశానవాటికల్లో నిర్ణయించిన రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది.

దీనిపై రెవెన్యూ మంత్రి ఆర్‌ అశోక మాట్లాడుతూ.. “కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ల కారణంగా మరణించిన వారి అంత్యక్రియలు చేయడంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ ఇబ్బందులను పరిష్కరించే లక్ష్యంతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము” అని తెలిపారు. దహన రుసుముగా రూ .250, బూడిద సేకరణ కుండకు రూ .100, మృతదేహాన్ని తీసుకెళ్లే వెదురు స్ట్రెచర్‌కి రూ .900లను బృహత్‌ బెంగళూరు మహానగర పాలికే(BBMB) ఫిక్స్ చేయగా.. మొత్తం రూ.1,250లను మాఫీ చేస్తున్నారు అశోక తెలిపారు. అంతేకాదు COVID-19 బాధితుల చివరి కర్మలను చేసే పౌర సంఘ సిబ్బందికి 500 రూపాయల(ఒక్కో మృతదేహానికి) ప్రోత్సాహకాన్ని అందించబోతున్నట్లు ప్రకటించారు. మరణించిన వారి మృతదేహాలను తాకేందుకు కుటుంబ సభ్యులు సిద్ధంగా లేరని, కొన్ని సందర్భాల్లో మృతదేహాన్ని తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేని సమయంలో పౌర సంఘ సిబ్బంది చేస్తున్న సేవలకు ఇది గుర్తింపు అని వెల్లడించారు.

Read This Story Also: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అప్‌డేట్ ఇచ్చేసిన సినిమాటోగ్రాఫర్‌

IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన