Minister Smriti Irani: బెయిల్‌పై విడుదలైన వ్యక్తిని కాపాడేందుకు వీధుల్లోకి వచ్చారా.. కాంగ్రెస్ నేతలపై స్మృతి ఇరానీ ఫైర్..

అవినీతికి మద్దతుగా కాంగ్రెస్‌ ఆందోళనలకు పిలుపునిచ్చిందని తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థపై ఒత్తిడి చేయడానికి కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల నుంచి ఢిల్లీకి అగ్రనేతలు వచ్చారని ఆరోపించారు. జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన వ్యక్తి కేంద్ర దర్యాప్తు సంస్థలపై

Minister Smriti Irani: బెయిల్‌పై విడుదలైన వ్యక్తిని కాపాడేందుకు వీధుల్లోకి వచ్చారా.. కాంగ్రెస్ నేతలపై స్మృతి ఇరానీ ఫైర్..
Union Minister Smriti Irani
Follow us

|

Updated on: Jun 13, 2022 | 1:24 PM

National Herald Case: రాహుల్‌గాంధీపై మండిపడ్డారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. అవినీతికి మద్దతుగా కాంగ్రెస్‌ ఆందోళనలకు పిలుపునిచ్చిందని తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థపై ఒత్తిడి చేయడానికి కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల నుంచి ఢిల్లీకి అగ్రనేతలు వచ్చారని ఆరోపించారు.ఇంతమంది బహిరంగంగానే ఏజెన్సీపై ఒత్తిడి తెస్తున్నారు. ఇదేనా కాంగ్రెస్ పార్టీ విధానం? జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన వ్యక్తి కేంద్ర దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. గాంధీ కుటుంబం అవినీతికి కాంగ్రెస్‌ శ్రేణులు మద్దతు తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. 1930లలో అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ 5,000 మంది స్వాతంత్ర్య సమరయోధులతో వాటాదారులుగా ఏర్పడింది. స్వాతంత్య్ర సమరయోధులు నడపాల్సిన సంస్థను నేడు గాంధీ కుటుంబం లాక్కుందని మంత్రి ఆరోపించరు. AJL ఉద్దేశ్యం వార్తాపత్రికలను ప్రచురించడం.. అయితే, 2008 లో కంపెనీ ఇకపై వార్తాపత్రికలను ప్రచురించదని ప్రకటించింది. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రవేశిస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా తెలుసు. రూ. 90 కోట్ల రుణాన్ని మాఫీ చేశారని ఆమె అన్నారు. కాంగ్రెస్‌కు డబ్బు విరాళంగా ఇచ్చిన దాతలను  మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఆ డబ్బును ప్రజా ప్రయోజనాల కోసం, ప్రజా సేవ కోసం ఉపయోగించకుండా, గాంధీ కుటుంబానికి లాభం చేకూర్చడానికి ఉపయోగించిందని మీకు తెలుసా?” అంటూ దాతల ప్రశ్నించారు. గాంధీ కుటుంబం తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రజలను ఆహ్వానించిందని మండిపడ్డారు ఇరానీ. ఈ చర్య దాని రాజకీయ స్వభావాన్ని తెలియజేస్తుందన్నారు.

90 కోట్ల రుణమాఫీ – స్మృతి ఇరానీ

ఇవి కూడా చదవండి

స్మృతి ఇరానీ ఇంకా మాట్లాడుతూ.. 2008 సంవత్సరంలో ఈ కంపెనీ స్వయంగా 90 కోట్ల రూపాయల రుణం తీసుకుందని, ఇప్పుడు ఈ కంపెనీ ప్రాపర్టీ వ్యాపారంలోకి రావాలని నిర్ణయించుకుంది. 2010లో రూ.5 లక్షలతో యంగ్ ఇండియా పేరుతో ఓ కంపెనీని ఏర్పాటు చేసి అందులో రాహుల్ గాంధీ డైరెక్టర్ గా చేరారు. కేవలం 75 శాతం మాత్రమే ఆయన వాటా కాగా.. మిగిలినది ఆయన తల్లి సోనియా గాంధీతో సహా మరికొంత మంది వద్ద ఉంది. దీని తర్వాత AJL  9 కోట్ల షేర్లు యంగ్ ఇండియాకు ఇవ్వబడ్డాయి. 9 కోట్ల షేర్‌తో ఈ కంపెనీ 99 శాతం షేర్లను యంగ్ ఇండియా దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ AJL కంపెనీకి 90 కోట్ల రుణాన్ని ఇచ్చింది.. అది తరువాత మాఫీ అవుతుంది.

గాంధీ కుటుంబానికి చెందిన 2000 కోట్ల ఆస్తిని కాపాడేందుకు ప్రయత్నాలు – స్మృతి ఇరానీ

“ఈ వ్యక్తులను నేను మరొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను.. మీరు రాహుల్ గాంధీని కలిస్తే డెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో అతని సంబంధం ఏమిటి? రాహుల్ గాంధీ పిలుపు మేరకు నేడు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేస్తున్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం కాదన్నారు. గాంధీ కుటుంబానికి చెందిన రూ. 2000 కోట్ల ఆస్తిని కాపాడే ప్రయత్నం ఇది.” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు స్మృతి ఇరానీ.

రాహుల్‌కు ఈడీ ప్రశ్నలు

ఇదిలావుంటే.. ఈడీ అధికారులు రాహుల్‌ను విచారిస్తున్నారు. ఇవాళ ఎక్కువ సేపు రాహుల్‌ను విచారించే అవకాశం లేదని ఈడీ అధికారులు చెబుతున్నారు. రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. మొదటి ప్రశ్నలో భాగంగా అడిగిన ప్రశ్నకు రాహుల్ జవాబు చెప్పలేకపోయినట్లుగా సమాచారం. ఇందులో.. మీకు ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నాయి అని రాహుల్ గాంధీని ED ప్రశ్నించింది. మీకు ఏ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి? మీకు విదేశాల్లో ఏదైనా బ్యాంకు ఖాతా ఉందా? అవును అయితే  దాని గురించి సమాచారం ఇవ్వండి.. మీ ఆస్తి ఎక్కడ ఉంది? విదేశాల్లో కూడా ఆస్తులు ఉన్నాయా? అవును అనుకుంటే వారి వివరాలను తెలియజేయండి అంటూ ప్రశ్నించింది ఈడీ.

ఓవైపు రాహుల్‌గాంధీ విచారణ కొనసాగుతుండగా ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. రెండంచెల భద్రత వలయాన్ని చేధించుకొని కొంతమంది కాంగ్రెస్‌ అగ్రనేతలు ఈడీ కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు. అయితే చత్తీస్‌ఘడ్‌ సీఎం భూపేష్‌ బాగెల్‌తో పాటు ఎంపీలు చిదంబరం, దిగ్విజయ్‌సింగ్‌ సూర్జేవాలాను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ను కూడా అదుపు లోకి తీసుకున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు