గిరిజన తెగల అభివృద్ధిలో అంతరాలు తగ్గించడమే లక్ష్యం: కేంద్ర మంత్రి జువల్ ఓరం

కేంద్ర గిరిజన మంత్రి జువల్ ఓరం, గిరిజన తెగల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. "పీఎం జన్‌మన్" పథకం ద్వారా 75 దుర్బల గిరిజన సమూహాలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడానికి రూ. 24,104 కోట్లు కేటాయించారు. 2024-25ని "జంజాతీయ గౌరవ వర్షం"గా జరుపుకోవాలని నిర్ణయించారు. ఇది గిరిజన నాయకులకు నివాళి అర్పిస్తుంది.

గిరిజన తెగల అభివృద్ధిలో అంతరాలు తగ్గించడమే లక్ష్యం: కేంద్ర మంత్రి జువల్ ఓరం
Durga Das Uikey And Jual Or

Updated on: May 27, 2025 | 11:00 AM

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం మంగళవారం న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి దుర్గా దాస్ ఉయ్కేతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని తెగల అభివృద్ధిలో ఒక్క అవకాశం కూడా వదులుకోబోమని అన్నారు. దేశంలోని వివిధ తెగల అభివృద్ధి రంగంలో అంతరాన్ని తగ్గించడంలో తన మంత్రిత్వ శాఖ అన్ని రకాల చొరవలు తీసుకుంటోందని అన్నారు. 2024 నవంబర్ 15 నుండి 2025 నవంబర్ 15 వరకు జంజాతీయ గౌరవ్ వర్ష్‌గా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని జరుపుకోవడానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి ఓరం గుర్తు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా గిరిజన పరిశోధనా సంస్థల ద్వారా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు ఏడాది పొడవునా జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి కార్యక్రమాలను నిర్వహించాలని గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

భారతదేశ స్వాతంత్ర్య పోరాటం, జాతి నిర్మాణంలో గిరిజన నాయకులు, సంఘాల సహకారాన్ని ఈ వార్షిక వేడుక సత్కరిస్తుంది. 18 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలోని 75 దుర్బల గిరిజన సమూహాల (PVTGs) సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో పీఎం జన్‌మన్‌ ఒక పరివర్తనాత్మక విధాన స్థాయి చొరవగా నిలుస్తుందని ఓరం అన్నారు. రూ.24,104 కోట్ల బడ్జెట్ వ్యయంతో (కేంద్ర వాటా రూ.15,336 కోట్లు, రాష్ట్ర వాటా రూ.8,768 కోట్లు), PVTG వర్గాలకు అవసరమైన సేవలను సమానంగా అందించడం, వారి జీవన పరిస్థితులను మెరుగుపరచడం, వారి సామాజిక-ఆర్థిక పురోగతిని సులభతరం చేయడం పీఎం జన్‌మన్‌ అని ఆయన తెలియజేశారు. మూడు సంవత్సరాలలోపు సురక్షితమైన గృహనిర్మాణం, స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన విద్య, ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, రోడ్డు కనెక్టివిటీ, విద్యుత్, స్థిరమైన జీవనోపాధి అవకాశాలను అందించడం ప్రధాన లక్ష్యాలుగా ఆయన వెల్లడించారు.

అంత్యోదయ మిషన్ గ్యాప్ డేటా (2022-23) ఆధారంగా అధిక గిరిజన సాంద్రత కలిగిన గ్రామాలు, ఆకాంక్ష జిల్లాలు, బ్లాక్‌లలో మౌలిక సదుపాయాలు, మానవ అభివృద్ధి అంతరాలను పరిష్కరించడంపై అభియాన్ దృష్టి సారించిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం 26 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలలోని 549 జిల్లాల్లోని 2,911 బ్లాక్‌లలో 63,843 గిరిజన గ్రామాల్లో నివసిస్తున్న దాదాపు 5 కోట్ల గిరిజన జనాభాను లక్ష్యంగా చేసుకుని ఆకాంక్షాత్మక బ్లాక్‌లు, జిల్లాలకు మించి విస్తరించి ఉందని, దీని మొత్తం వ్యయం రూ.79,156 కోట్లుగా మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా గిరిజన విద్యార్థుల విద్య నాణ్యత, మౌలిక సదుపాయాలు, సమగ్ర అభివృద్ధిని పెంపొందించడానికి, ముఖ్యంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS)లో అనేక పరివర్తన కార్యక్రమాలను అమలు చేసిందని ఆయన తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల కోసం ఐదు రకాల స్కాలర్‌షిప్ పథకాలను అమలు చేస్తుందని, దీని ద్వారా ఏటా 30 లక్షల మంది గిరిజన విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని ఓరం అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి