Corona: కరోనా టెర్రర్‌పై నేడు దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్‌.. ఐఎంఏ సభ్యులతో కేంద్రమంత్రి మాండవీయ వీడియో కాన్ఫరెన్స్‌..

| Edited By: Narender Vaitla

Dec 27, 2022 | 6:27 AM

కరోనా టెర్రర్‌ను ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై మంగళవారం దేశమంతా ఆస్పత్రుల్లో మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తున్నారు. కర్నాటకలో విద్యాసంస్థలు, థియేటర్లలో మాస్క్‌లను కంపల్సరీ చేశారు.

Corona: కరోనా టెర్రర్‌పై నేడు దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్‌.. ఐఎంఏ సభ్యులతో కేంద్రమంత్రి మాండవీయ వీడియో కాన్ఫరెన్స్‌..
Mansukh Mandaviya
Follow us on

కరోనా టెర్రర్‌ను ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై నేడు దేశమంతా ఆస్పత్రుల్లో మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తున్నారు. కర్నాటకలో విద్యాసంస్థలు, థియేటర్లలో మాస్క్‌లను తప్పనిసరి చేశారు. ప్రస్తుతం దేశమంతా కరోనాపై హైఅలర్ట్‌ కొనసాగుతోంది. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సభ్యులతో సమీక్ష నిర్వహించారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్‌ మాండవీయ. చైనా లాగా భారత్‌లో పరిస్థితులు లేవని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐఎంఏ సభ్యులు కేంద్రమంత్రికి తెలిపారు. దేశం నలుమూలల నుంచి 100 మంది వైద్యనిపుణలు ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్‌తో హాజరయ్యారు. కరోనా విజృంభిస్తే ఎలా తట్టుకోవాలన్న విషయంపై మంగళవారం దేశమంతా ఆస్పత్రుల్లో మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తున్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ లభ్యత, బెడ్స్‌పై మాక్‌డ్రిల్‌లో సమీక్షిస్తారు. ఆక్సిజన్‌ కొరత లేకుండా చూసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే సూచించింది.

రాత్రి ఒంటిగంట వరకే అనుమతి..

మరోవైపు పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. బెంగళూర్‌కు విదేశాల నుంచి వచ్చిన 12 మంది యాత్రికులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వాళ్ల శాంపిల్స్‌ను జోనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించారు. కేసులు పెరగడంతో కర్నాటకలో మళ్లీ కరోనా ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. విద్యాసంస్థలు , థియేటర్లలో మాస్క్‌లను కంపల్సరీ చేసింది కర్నాటక ప్రభుత్వం. న్యూ ఇయర్‌ వేడుకలను కూడా రాత్రి ఒంటిగంట వరకే అనుమతించాలని ఆదేశించారు. మాస్క్‌లు ధరించిన వాళ్లనే వేడుకల్లోకి అనుమతించాలని సూచించారు.

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఇప్పటికే అలర్టయ్యింది. ఆస్పత్రి పరిసరాల్లో మాస్కులను తప్పనిసరి చేశారు. బీహార్‌ లోని గయా ఎయిర్‌పోర్ట్‌లో నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో ముగ్గురు మయన్మార్‌ నుంచి రాగా.. ఒకరు బ్యాంకాక్‌ నుంచి వచ్చినట్టు గుర్తించారు. వారందరిలోనూ లక్షణాల్లేవని.. ఐసోలేషన్‌లో ఉన్నారని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి

కరోనాపై తొలిసారి పెదవి విప్పిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌..

కరోనాపై తొలిసారి పెదవి విప్పారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌. ప్రజలు ఈ సమయంలో దేశభక్తితో మెలగాలని సూచించారు. మనమంతా కలిసి మహమ్మారిని తరిమేద్దామని పిలుపునిచ్చారు. చైనాలో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. అయితే గత ఐదురోజులుగా ఒక్కరు కూడా కరోనాతో చనిపోలేదని చైనా ప్రభుత్వం కాకమ్మ కబుర్లు చెబుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..