కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని సంచలన కామెంట్లు చేశారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ డ్రగ్స్ తీసుకునేవారని, సిగరెట్ తాగేవారని అన్నారు. మహాత్మా గాంధీ కుమారుడు కూడా డ్రగ్స్ తీసుకునేవారని చెప్పడం గమనార్హం. నషా ముక్తి జాగరణ్ అభియాన్‌లో పాల్గొనేందుకు రాజస్థాన్ లోని భరత్ పూర్ కు వచ్చిన కేంద్ర మంత్రి.. ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కౌశల్ కిషోర్ కామెంట్లపై కాంగ్రెస్, ప్రతిపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ మాటలను ఉపసంహరించుకుని, వెనుక్తు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. పార్లమెంటు శీతాకాల సమావేశాలు కూడా కొనసాగుతున్నాయి. కిషోర్ చాలా సంవత్సరాలుగా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ మత్తు కారణంగా తన కుమారుడిని నా కొడుకును కోల్పోయానని ఇటీవల చెప్పాడు. అందుకే ఇప్పుడు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి డ్రగ్ వ్యతిరేక ప్రచారానికి ఆయన మద్దతు తెలిపారు.
డ్రగ్స్ అడిక్షన్ అనేది దేశవ్యాప్తంగా ఆందోళనకరంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటీష్ వాళ్లను దేశం నుంచి తరిమికొట్టామని, మత్తును మాత్రం వారు మనదేశంలో విడిచి వెళ్లిపోయారని మండిపడ్డారు. డ్రగ్స్ వల్ల ఏటా లక్షల మంది చనిపోతున్నారన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ నుంచి తన కుమారుడిని కాపాడుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే డ్రగ్స్ వల్ల ఎవరూ తమ బిడ్డను పోగొట్టుకోకూడదని కోరుకుంటున్నట్లు విజ్ఞప్తి చేశారు. తన కుమారుడిని చికిత్స కోసం డాక్టర్ల దగ్గరికి తీసుకువెళ్లితే.. అక్కడ చికిత్స అందించిన కొద్ది రోజులకే ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు.
#WATCH जवाहर लाल नेहरू जी नशा करते थे, सिगरेट पीते थे और महात्मा गांधी जी का एक लड़का नशा करता था। आगर आप पढ़ेंगे और देखेंगे तो पता चल जाएगा: नशा मुक्ति जागरण अभियान कार्यक्रम में केंद्रीय आवासन एवं शहरी कार्य राज्यमंत्री मंत्री कौशल किशोर, भरतपुर, राजस्थान (14.12) pic.twitter.com/VdZZ93k8sx
— ANI_HindiNews (@AHindinews) December 14, 2022
తన కుమారుడు 2020లో చనిపోయాడని కౌశల్ కిషోర్ చెప్పారు. వయసులో చాలా చిన్నవాడైన అతను.. మత్తు కారణంగా త్వరగానే ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయాడు. కాబట్టి తన లాంటి కష్టం ఇంకా ఎవరికీ రాకూడదన్న ఉద్దేశ్యంతో డ్రగ్స్‌పై అవగాహన కల్పించే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నట్లు కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..