Minister Dharmendra Pradhan: సింగపూర్ నుంచి నేర్చుకోవల్సింది చాలా ఉంది.. యువతకు ధర్మేంద్ర ప్రధాన్ దిశానిర్దేశం..

|

Jul 17, 2023 | 5:34 PM

సింగపూర్-ఇండియా హ్యాకథాన్ మూడో ఎడిషన్ ముగింపు సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..

Minister Dharmendra Pradhan: సింగపూర్ నుంచి నేర్చుకోవల్సింది చాలా ఉంది.. యువతకు ధర్మేంద్ర ప్రధాన్ దిశానిర్దేశం..
Dharmendra Pradhan
Follow us on

భారత్-సింగపూర్ కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉందన్నారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ప్రపంచం మొత్తానికి వర్క్‌ఫోర్స్‌ను సిద్ధం చేయడంలో అపారమైన అవకాశాలన్నాయన్నారు. సింగపూర్-ఇండియా హ్యాకథాన్ మూడో ఎడిషన్ ముగింపు సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. “విజ్ఞానం, నైపుణ్యం, ఆవిష్కరణల రంగంలో మా సహకారం భారతదేశానికి మాత్రమే కాకుండా, మన వైపు చూస్తున్న దక్షిణాది దేశాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది” అని ధర్మేంద్ర ప్రధాన్ ఈ సందర్భంగా అన్నారు.

సింగపూర్ నైపుణ్యత తత్వాన్ని మెచ్చుకున్న ధర్మేంద్ర ప్రధాన్.. మంచి ఉద్యోగాల కోసం శిక్షణ, ఆత్మవిశ్వాసంతో కూడిన దేశాన్ని నిర్మించడంలో ఎవరినీ వదిలిపెట్టకూడదనే తత్వాన్ని వారి నుంచి భారత్ నేర్చుకోవచ్చని అన్నారు. సింగపూర్ ఇప్పటికే సాధించిన దాని ప్రకారం భారతీయ పరిశ్రమ సంబంధిత కోర్సు పాఠ్యాంశాలపై, దేశానికి ప్రాధాన్యతనిచ్చే మరొక రంగంపై పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు.

జ్ఞానమే శక్తి అని అన్నారు. SIH వంటి కార్యక్రమాలు, జ్ఞాన మార్పిడిని సులభతరం చేయడానికి మన రెండు దేశాల యువత ఆవిష్కరణ సామర్థ్యాన్ని వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతాయన్నారు. సామాజిక సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడానికి మనం హ్యాకథాన్ సంస్కృతిని ఉపయోగించుకోవాలన్నారు. STEM రంగాలకు మించి ముందుకు తీసుకెళ్లాలని ఆయన అన్నారు.

“భారత్- సింగపూర్‌లు పరస్పర ప్రాధాన్యతను సాధించేందుకు కలిసి పనిచేయడానికి అపారమైన అవకాశాలన్నాయని, భవిష్యత్తులో శ్రామికశక్తిని సిద్ధం చేయడం కోసం.. ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి నైపుణ్యాభివృద్ధి, విజ్ఞాన సహకారం ముఖ్యమైన అంశమని కేంద్ర మంత్రి అన్నారు.

హ్యాకథాన్ ఈవెంట్ చాలా ప్రత్యేకమైనదని సింగపూర్ ఉప ప్రధాని, ఆ దేశ ఆర్థిక మంత్రి లారెన్స్ వాంగ్ అన్నారు. ఎందుకంటే ఇది ప్రపంచ సవాళ్లను రెండు దేశాలు కలిసి పరిష్కరించడానికి ఇదో మంచి అవకాశమన్నారు. ఈ అవకాశాలను యువత ఉపయోగించుకోవాలని అన్నారు. ప్రధాని మోదీ దార్శనికత నుంచి ఈ కార్యక్రమం పుట్టుకొచ్చిందన్నారు. కొవిడ్ మహమ్మారి తర్వాత మొదటి సారి గాంధీనగర్‌కు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ముగింపు వేడుకలను ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE), నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ, సింగపూర్ సంయుక్తంగా నిర్వహించాయి. తన ప్రసంగం అనంతరం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్ (ఐఐటీజీ)లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గెలుపొందిన జట్లకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బహుమతులు అందజేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం