MSP Hikes: దీపావళి వేళ రైతులకు శుభవార్త.. పంటల మద్దతు ధర పెంపు.. వివరాలివే..

|

Oct 18, 2022 | 4:45 PM

దీపావళి వేళ రైతులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. రైతులకు లబ్ధి చేకూరుస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంటలకు కనీస మద్దతు ధర పెంచింది.

MSP Hikes: దీపావళి వేళ రైతులకు శుభవార్త.. పంటల మద్దతు ధర పెంపు.. వివరాలివే..
Minimum Support Prices
Follow us on

దీపావళి వేళ రైతులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. రైతులకు లబ్ధి చేకూరుస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంటలకు కనీస మద్దతు ధర పెంచింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలతో పాటు.. రైతుల పంటకు మద్ధతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు.

రబీ పంటలకు కనీస మద్ధతు ధర పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. మద్ధతు ధర పెంచిన పంటల వివరాలను కూడా వెల్లడించారాయన. గోధుమలు, బార్లీ, ఆవాలు, కుసుమ పువ్వు, పప్పు మొదలైనవి ఉన్నాయి. కేంద్ర మంత్రి ప్రకటన ప్రకారం.. గోధుమ పంటకు కనీస మద్దతు ధరను రూ.110 పెంచారు. బార్లీ పంటకు కనీస మద్దతు ధర రూ.100, శనగ పంటకు రూ.105, మసూర్ పప్పులకు రూ. 500, ఆవాలు 400, కుసుమపువ్వు పంటకు రూ. 209 చొప్పున కనీస మద్ధతు ధరను పెంచింది కేంద్ర ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి

అయితే, కేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచిన ధర ప్రకారం కొత్త ధరలు ఇలా ఉండనున్నాయి. వాటి వివరాలివే.. గోధుమ క్వింటాల్ ధర రూ. 2,125, బార్లీ రూ. 1,735, శనగ పంటకు రూ. 5,335, మసూర్ రూ. 6,000, ఆవాలు రూ. 5,450, కుసుమ పువ్వు పంటకు రూ. 5,650 చొప్పున ధర పలుకనుంది. కేంద్రం పెంచిన ధర 2023-24 సంవత్సరాలకు వర్తించనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..