
Budget Session 2026 Parliament Highlights: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ (ఫిబ్రవరి 1, 2026) తొమ్మిదోసారి బడ్జెట్-2026-27 ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్ థీమ్‌గా బడ్జెట్ ఉండనుందని ముందు నుంచే ఊహించారు. బడ్జెట్‌లో ఏయే రంగాలపై ఫోకస్ ఉంటుంది. వేటికి పెద్దపీట వేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి ద్రవ్య లోటుకు కళ్లెం వేయడంతో పాటు..క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ను గణనీయంగా పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. రైల్వే, రహదారులు, డిఫెన్స్, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌లో మౌలిక సదుపాయల కోసం భారీగా పెట్టుబడులు పెట్టనున్నారని సమాచారం. తెలుగు రాష్ట్రాలు ఆకాంక్షలు, సామాన్యుడి ఆశలు.. వీటన్నింటి దృష్టిలో ఉంచుకుని కేంద్రంలోని మోదీ సర్కార్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది..
— 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నిర్మలాసీతారామన్
— ఉదయం 8:30కి కర్తవ్యభవన్‌కు నిర్మలాసీతారామన్
— ఉదయం 9:30కి రాష్ట్రపతి ముర్మును కలవనున్న నిర్మల
— ఉదయం 10 గంటలకు పార్లమెంట్‌కు నిర్మలా సీతారామన్
— ఉదయం 10:15కి మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం
— బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేంద్ర కేబినెట్
— ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్
— సుమారు 2గంటలపాటు బడ్జెట్ ప్రసంగం ఉండే అవకాశం
— మధ్యాహ్నం 2:30కి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం
2026 బడ్జెట్ చరితత్రాత్మక అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుందన్నారు. నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారని, భారత్‌లో సంస్కరణలు ఎక్స్‌ప్రెస్ వేగంతో దూసుకెళ్తున్నాయని అన్నారు. బడ్జెట్‌తో ద్రవ్యోల్బణం తగ్గుతుందని, నారీశక్తికి ఈ బడ్జెట్ నిదర్శనం అని మోదీ అన్నారు. బయోఫార్మా,సెమీ కండక్టర్ రంగానికి ప్రోత్సాహం, MSME రంగం బలోపేతానికి కృష్టి అని అన్నారు.
క్యాన్సర్ రోగులకు బడ్జెట్‌తో ఉపశమనం కల్పించింది కేంద్రం. క్యాన్సర్ రోగులు ఉపయోగించే 17 రకాల క్యాన్సర్ మందులపై సుంకాన్ని తగ్గించారు. ఏప్రిల్ 1 నుంచి క్యాన్సర్ మందులపై ఎంఏటీ పన్నులో మినహాయింపులు ఇచ్చారు. పన్నును 15 శాతం నుంచి 14 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం.
మైక్రోవేవ్ ఓవెన్ల భాగాలపై బీసీడీ మినహాయింపుతో పాటు వ్యక్తిగత వస్తువుల దిగుమతులపై 20 శాతం నుంచి 10 శాతానికి సుంకాన్ని తగ్గించారు. ఇక పౌర శిక్షణ, ఇతర విమానాల తయారీదారులకు అసవసరమైన విడి భాగాలపై ప్రధామిక కస్టమ్ సుంకాన్ని మినహాయించారు.
ఇక ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబుల్లో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. కార్పొరేట్, ఐటీ స్లాబుల్లో ఎలాంటి మార్పులు ఉండవని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబులు యథాతథంగా ఉంటాయని స్పష్టం చేశారు. అటు విదేశీ విద్య, వైద్య ఖర్చులపై టీసీఎస్ రేటును 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించాలని నిర్ణయించారు.
ఇక బాండెడ్ జోన్‌లోని ఏదైనా పెద్ద మూలధన వస్తువులు, పరికారాలను అందించే తయారీదారులకు 5 సంవత్సరాల పాటు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. క మాన్‌పవర్ సరఫరా చేసే కంపెనీలకు టీడీఎస్ 1 లేదా 2 శాతంగా ఉంటుంది. చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం ప్రత్యేక పథకం తీసుకురానున్నారు.
ట్యాక్స్ చెల్లించేవారికి బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు గుడువును మరింత పొడిగించారు. ఐటీఆర్ 1, ఐటీఆర్ 2 దాఖలు చేయడానికి జులై 1 వరకు సమయమిచ్చారు. ఇక ఆడిట్ కాని వ్యాపార కేసులు, ట్రస్ట్‌లకు ఆగస్ట్ 31 వరకు గుడువు పొడిగిస్తున్నట్లు ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నామమాత్రపు ఆలస్యపు రుసుంలతో డిసెంబర్ 31 నుండి మార్చి 31 వరకు రిటర్న్స్‌లను సవరించడానికి ఉన్న గడువును పొడిగిస్తూ బడ్జెట్‌లో నిర్ణయం ప్రకటించారు. పన్ను చెల్లింపుదారులకు ఇది శుభవార్తగా చెప్పవచ్చు.
కేంద్ర వార్షిక బడ్జెట్ ముగిసింది. మంత్రి నిర్మలా సీతారామన్ 80నిమిషాలకపైగా ప్రసంచారు. అయితే ఈ బడ్జెట్‌లో ఆదాయపు పన్ను స్లాబ్‌లలో ఎటువంటి మార్పులు చేయలేదు. స్లాబ్‌లు యథాథధంగా ఉంచారు.
స్టాక్ మార్కెట్ గందరగోళంలో ఉంది. బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. స్టాక్ మార్కెట్ 2,000 పాయింట్లకు పైగా సెన్సెక్స్ పడిపోయింది. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుండి స్టాక్ మార్కెట్ గణనీయమైన క్షీణతను చూసింది.
కేంద్ర బడ్జెట్‌లో క్యాన్సర్ రోగులు ఉపయోగించే 17 ఔషధాలపై పన్ను తగ్గించింది. సెంట్రల్ ఎక్సైజ్ నుంచి బయో గ్యాస్ ద్వారా ఉత్పత్తయ్యే సీఎన్‌జీకి మినహాయింపు ఇచ్చింది. అలాగే మైక్రో అవెన్స్‌పై పన్ను తగ్గింపు, పౌర విమానాల విడిభాగాలపై పన్ను తగ్గిస్తూ ప్రకటించారు కేంద్ర మంత్రి.
Cancer
2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దాదాపు 80 నిమిషాలకు పైగా ఆమె ప్రసంగం సాగింది.
స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు కొనసాగుతున్నాయి. 1600 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ కొనసాగుతుండగా, 700 పాయింట్లతో నిఫ్టి కొనసాగుతోంది. ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై ఎస్‌టీటీని పెంచడంతో నష్టాల్లోకి జారుకున్నాయి.
ఆదాయపు పన్ను రిటర్న్‌లను వెల్లడించినందుకు ఇకపై ఎటువంటి జైలు శిక్ష ఉండదని, 30 శాతం పెనాల్టీ ఉంటుందని కేంద్ర మంత్రి నిర్మలమ్మ తెలిపారు. అంటే తమ ఆదాయాన్ని దాచిపెట్టే వారికి ఇకపై 30 శాతం వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
సామాన్యులు సైతం ఆదాయపు పన్నును ఫైల్ చేసేలా పన్ను చట్టంలో మార్పులు తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఫైల్ చేసే ఫారాలను త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు.
అలాగే రహదారి ప్రమాదాల పరిహారం వడ్డీపై పన్ను తొలగింపు ఉంటుందని, సవరించిన పన్ను రిటర్నుల దాఖలు గడువు పెంపు ఉంటుందని అన్నారు. డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగింపు, విదేశీ యాత్రలపై ట్యాక్స్ తగ్గింపు ఉంటుందన్నారు. చదువులు, వైద్యంపై టీసీఎస్ 5శాతం నుంచి 2శాతానికి తగ్గింపు అందించనున్నట్లు చెప్పారు. అలాగే మ్యాన్‌పవర్ సరఫరా చేసే సంస్థలపై టీడీఎస్ తగ్గిస్తున్నట్లు చెప్పారు.
ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉంది? మీ రేటింగ్ ఇవ్వండి
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలమ్మ తెలిపారు. సరళతరం చేసిన ఫారాలు త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. సామాన్యులు సైతం ఫైల్ చేసేలా మార్పులు ఉంటాయన్నారు.
కొబ్బరి ఉత్పత్తి కోసం కొబ్బరి ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే 500 రిజర్వాయర్లలో చేపల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు. పశు సంవర్ధక శాఖలో భారీగా ప్రోత్సహకాలు ఉంటాయని, వ్యవసాయ ఆదాయం పెంచేందుకు అధిక విలువ పంటలకు ప్రోత్సాహం అందించనున్నట్లు తెలిపారు. అలాగే తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు. కాయలు కాయని చెట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు తెలిపారు. జీడిపప్పు, కోకో ఉత్పత్తి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు, గంధం చెట్ల వనాలు, బాదం, పైన్‌నట్స్ కోసం ప్రత్యేక పథకం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ప్రతి జిల్లాలో బాలికల హాస్టళ్లను నిర్మించనున్నట్లు ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది. మూడు కొత్త ఎయిమ్స్‌లను కూడా ప్రకటించారు. బడ్జెట్‌లో ప్రభుత్వం యువతపై ప్రత్యేక దృష్టి సారిస్తుట్లు మంత్రి తెలిపారు.
Railway
దేశంలో మూడు ఆయుర్వేద ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే ఆయుష్ కేంద్రాల అప్‌గ్రేడేషన్, సంప్రదాయ వైద్య పరిశోధనకు జామ్‌నగర్‌లో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ప్రైవేటు రంగంలో పశువైద్య, డయాగ్నస్టిక్స్ ఏర్పాటుకు ప్రోత్సాహం, యువత కోసం వైద్య రంగంలో కొత్త కోర్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడు కొత్త హై-స్పీడ్ రైలు కారిడార్లను నిర్మిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించారు. ముంబై-పుణె కారిడార్, ప్రధాన నగరాలకు హై-స్పీడ్ రైలు కారిడార్ నిర్మించనున్నట్లు చెప్పారు.
విదేశాల్లో ఉంటున్న భారతీయులకు గుడ్‌న్యూస్ తెలిపింది కేంద్రం. భారత స్టాక్ మార్కెట్‌లో పెట్టే పెట్టుబడుల పరిమితి పెంపునకు అవకాశం ఇచ్చింది. అలాగే మూలధన వ్యయం రూ.12.2లక్షల కోట్లకు పెంచింది. 5 లక్షల జనాభా దాటిన నగరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. 5 ప్రాంతీయ వైద్య కేంద్రాలు, విద్య, వైద్య పరిశోధనలు సంస్థల ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
ఉపాధి, వృద్ధిని ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం ఎంతో చేసిందని ఆర్థిక మంత్రి అన్నారు. 2025 లో 350కి పైగా సంస్కరణలు ప్రారంభించినట్లు చెప్పారు.
కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. సంస్కరణల ఎక్స్‌ప్రెస్ మాదిరిగా మా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. బయోఫార్మా మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్ కోసం రానున్న ఐదేళ్లలో రూ. 10 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌కు చేరుకుని లోక్‌సభలో బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టారు.
జనవరిలో స్థూల GST వసూళ్లు 6.2% పెరిగి రూ.1.93 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ప్రధానంగా దిగుమతుల నుండి అధిక ఆదాయం లభించింది. మొత్తం వాపసులు 3.1% తగ్గి రూ.22,665 కోట్లకు చేరుకున్నాయి. అయితే నికర GST వసూళ్లు జనవరిలో 7.6% పెరిగి రూ.1.71 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
సెప్టెంబర్ 22, 2025 నుండి అమలులోకి వచ్చిన తర్వాత దాదాపు 375 వస్తువులపై GST రేట్లు తగ్గించింది కేంద్రం. దీని వలన వస్తువులు చౌకగా మారాయి. అలాగే గతంలో లగ్జరీ, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై మాత్రమే పరిహార సెస్ విధించింది.
మరి కాసేపట్లో లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్. ఈ నేపథ్యంలో బడ్జెట్ 2026కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
కేంద ప్రభుత్వం బడ్జెట్ ప్రకటన వేళ బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. నిన్న రూ.1.60 లక్షల వద్ద ఉండగా.. ఇవాళ రూ.1.45 లక్షలకు పడిపోయాయి. డాలర్ బలపడటంతో గోల్డ్ రేట్లు పడిపోయాయి.. Read Full Article
కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆర్ధికశాఖ కార్యాలయం బయట బడ్జెట్ ట్యాబ్‌ను ప్రదర్శించారు. సాంప్రదాయ ఎరుపు రంగు బాహీ-ఖాతా శైలి బ్యాగ్‌లో ఉన్న డిజిటల్ టాబ్లెట్‌ను చేతిలో పట్టుకుని కనిపించారు. అనంతరం ఆర్ధికశాఖ కార్యాలయం నుంచి బయల్దేరి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసేందుకు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తమ బృందంతో కలిసి పార్లమెంటుకు చేరుకున్నారు.
#WATCH | #UnionBudget2026 | Union Finance Minister Nirmala Sitharaman and MoS Finance Pankaj Chaudhary, along with their team, arrive at the Parliament. pic.twitter.com/UBv1ZhfaoE
— ANI (@ANI) February 1, 2026
సెన్సెక్స్ రోజు కనిష్ట స్థాయి నుండి 200 పాయింట్లకు పైగా పెరిగింది. నిఫ్టీ 25,350 సమీపంలో ఉంది.. మార్కెట్ పెరుగుదలకు బడ్జెట్‌పై ఉన్న ఆశావాదం కీలక కారణాలలో ఒకటిగా చెబుతున్నారు. మొదట నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. లాభాల్లోకి వచ్చాయి..
బడ్జెట్ సందర్భంగా స్టాక్‌మార్కెట్ల స్పెషల్ ట్రేడింగ్ సెషన్
స్వల్ప నష్టాలతో మొదలై లాభాల్లోకి వచ్చిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ కంపెనీలకు ఊతమిచ్చే చర్యలపై..
నిర్మలా సీతారామన్ చేసే ప్రకటనపై దలాల స్ట్రీట్ ఆసక్తి
కేంద్ర బడ్జెట్ ఆదివారం ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి
నిర్మలా సీతారామన్‌కు ఇది తొమ్మిదో బడ్జెట్
10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మొరార్జీ దేశాయ్
తొమ్మిదిసార్లు బడ్జెట్ సమర్పించిన చిదంబరం
75 ఏళ్ల సంప్రదాయానికి భిన్నంగా ఈసారి నిర్మల స్పీచ్
బడ్జెట్ ప్రసంగంలోని పార్ట్-Bపై నిర్మల ఫోకస్
దేశ ఆర్థిక భవిష్యత్తు కోసం సంపూర్ణమైన విజన్‌ను..
పార్ట్-బిలో వివరించనున్న నిర్మలా సీతారామన్
బడ్జెట్ ప్రసంగానికి ముందు నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తన బృందంతో కలిసి, వరుసగా తొమ్మిదో కేంద్ర బడ్జెట్‌ను సమర్పించే ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు.
#WATCH | Delhi | Union Finance Minister Nirmala Sitharaman, along with her team, calls on President Droupadi Murmu before presenting her ninth consecutive Union Budget pic.twitter.com/96H5JV5obv
— ANI (@ANI) February 1, 2026
కాసేపట్లో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
కర్తవ్యభవన్ నుంచి రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ఆర్థికమంత్రి
బడ్జెట్‌కు రాష్ట్రపతి ఆమోదం తర్వాత.. పార్లమెంటు భవనంలో కేంద్ర కేబినెట్ భేటీ
కేబినెట్ ఆమోదం తర్వాత 11గంటల బడ్జెట్ సమర్పణ
ట్రంప్ సుంకాలను ఎదుర్కొనేలా ఆర్థిక ప్రణాళికపై ఆసక్తి
వ్యవసాయం, తయారీరంగాలకు కేటాయింపులపై ఎదురుచూపులు
ధరలభారం నుంచి సామాన్యుడికి ఊరటనిస్తారా
ఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బృందంతో కలిసి ఆర్థిక మంత్రిత్వ శాఖ వెలుపల బడ్జెట్ ట్యాబ్‌తో కనిపించారు. అంతకుముందు సిబ్బందితో భేటీ అయ్యారు.
ఈరోజు ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టనున్నారు.
#WATCH | Delhi: Union Finance Minister Nirmala Sitharaman, along with her team, with the Budget tablet outside the Ministry of Finance.
She will present the #UnionBudget2026 today at around 11 AM in Lok Sabha. pic.twitter.com/x5oPMFlWbD
— ANI (@ANI) February 1, 2026
ఈరోజు ఆదివారం అయినా పనిచేయనున్న స్టాక్ మార్కెట్లు
కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్
ఈరోజు ట్రేడింగ్‌పై కొన్ని నిబంధనలు వర్తింపు
నిన్న కొనుగోలు చేసిన షేర్ల అమ్మకాలపై నిషేధం
వికసిత్ భారత్ థీమ్‌గా ఉండనున్న బడ్జెట్
చరిత్రలో తొలిసారిగా ఆదివారం నాడు బడ్జెట్ సమర్పణ
బడ్జెట్ నేపథ్యంలో ఆదివారం పనిచేయనున్న స్టాక్ మార్కెట్
గ్రీన్ ఎనర్జీ, డిఫెన్స్ సెక్టార్, మూలధన వ్యయంపై ఫోకస్
10 నుంచి 15 శాతం పెరగనున్న మూలధన వ్యయం
రూ. 12 నుంచి 12.5 లక్షల కోట్లు ఉండే చాన్స్
దేశంలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట
రైల్వేలు, రహదారులు, డిఫెన్స్, మాన్యుఫాక్చరింగ్‌పై ఫోకస్
9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నిర్మలాసీతారామన్
ఉదయం 8:30కి కర్తవ్యభవన్‌కు నిర్మలాసీతారామన్
ఉదయం 9:30కి రాష్ట్రపతి ముర్మును కలవనున్న నిర్మల
ఉదయం 10 గంటలకు పార్లమెంట్‌కు నిర్మలా సీతారామన్
ఉదయం 10:15కి మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం
బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేంద్ర కేబినెట్
ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్
సుమారు 2గంటలపాటు బడ్జెట్ ప్రసంగం ఉండే అవకాశం
మధ్యాహ్నం 2:30కి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం