‘ అరె ! గ్రహణాన్ని చూడలేకపోయానే ‘! మోదీ నిరాశ

అనేకమంది భారతీయుల్లాగే తానుకూడా సూర్యగ్రహణాన్ని చూడలేకపోయానని ప్రధాని మోదీ ఉసూరుమన్నారు. ఆకాశంలో మబ్బులు కమ్మేసి ఉన్న కారణంగా గ్రహణాన్ని చూడలేకపోయినట్టు ఆయన ట్వీట్ చేశారు. కేరళలోని కోజికోడ్ లో లైవ్ స్ట్రీమ్ పై ఆయన ‘ గ్రహణ వీక్షణ ‘ తాలూకు ఫోటోలను పోస్ట్ చేశారు. దట్టమైన మేఘాలు కమ్మి ఉన్నందున దురదృష్టవశాత్తూ కోజికోడ్ లోను, మరికొన్ని చోట్ల ఇది కనబడలేదని ఆయనపేర్కొన్నారు. అయితే ఈ గ్రహణానికి సంబంధించి వివరాలను తను నిపుణులను అడిగి తెలుసుకుంటానని మోదీ […]

 అరె ! గ్రహణాన్ని చూడలేకపోయానే ! మోదీ నిరాశ

Edited By:

Updated on: Dec 26, 2019 | 6:08 PM

అనేకమంది భారతీయుల్లాగే తానుకూడా సూర్యగ్రహణాన్ని చూడలేకపోయానని ప్రధాని మోదీ ఉసూరుమన్నారు. ఆకాశంలో మబ్బులు కమ్మేసి ఉన్న కారణంగా గ్రహణాన్ని చూడలేకపోయినట్టు ఆయన ట్వీట్ చేశారు. కేరళలోని కోజికోడ్ లో లైవ్ స్ట్రీమ్ పై ఆయన ‘ గ్రహణ వీక్షణ ‘ తాలూకు ఫోటోలను పోస్ట్ చేశారు. దట్టమైన మేఘాలు కమ్మి ఉన్నందున దురదృష్టవశాత్తూ కోజికోడ్ లోను, మరికొన్ని చోట్ల ఇది కనబడలేదని ఆయనపేర్కొన్నారు. అయితే ఈ గ్రహణానికి సంబంధించి వివరాలను తను నిపుణులను అడిగి తెలుసుకుంటానని మోదీ అన్నారు. ఢిల్లీలో కూడా దట్టమైన పొగమంచు కారణంగా ఇది కనబడలేదు. గురువారం ఉదయం 8 గంటల 17 నిముషాల నుంచి 10 గంటల 57 నిముషాల వరకు సూర్య గ్రహణం కొనసాగింది. కర్నాటక, కేరళ, తమిళనాడువాసులు పూర్తిగాను, దేశంలోని ఇతర ప్రాంతాలవారు పాక్షికంగాను గ్రహణాన్ని చూడగలిగారు. ఇండియాతో బాటు సౌదీ అరేబియా, ఖతర్, యుఎఈ, శ్రీలంక, ఒమన్, మలేసియా, ఇండోనీసియా, సింగపూర్ దేశాల్లో ఈ గ్రహణం పూర్తిగా సంభవించింది. ఈ ఏడాదిలో ఇది మూడవ గ్రహణం కాగా.. ఈ దశాబ్దంలో చివరిది.