అయోధ్యలో భూమిపూజకు ‘ఉమ’కు ఆహ్వానం, అద్వానీకి మొండిచెయ్యి !

| Edited By: Pardhasaradhi Peri

Aug 01, 2020 | 1:52 PM

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఆగస్టు 5 న జరిగే భూమి పూజకు బీజేపీ నాయకురాలు ఉమాభారతికి, మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ కు ఆహ్వానాలు అందాయి. అయితే పార్టీ కురువృధ్ధుడు..

అయోధ్యలో భూమిపూజకు ఉమకు ఆహ్వానం, అద్వానీకి మొండిచెయ్యి !
Follow us on

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఆగస్టు 5 న జరిగే భూమి పూజకు బీజేపీ నాయకురాలు ఉమాభారతికి, మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ కు ఆహ్వానాలు అందాయి. అయితే పార్టీ కురువృధ్ధుడు ఎల్.కె.అద్వానీకి, మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీకి ఇన్విటేషన్లు వెళ్ళలేదు. నిజానికి బాబరీ మసీదు కేసులో వీరు నిందితులైనప్పటికీ అయోధ్యలో రామాలయ నిర్మాణానికి పరోక్షంగా  తమవంతు కృషి చేశారు. ఈ కేసులో లక్నో లోని సీబీఐ కోర్టు గతవారమే అద్వానీని సుదీర్ఘంగా సుమారు నాలుగున్నర గంటలపైగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. అధికారులు ఆయనను సుమారు వెయ్యి ప్రశ్నలు వేశారు. అయితే తనపై వచ్చిన అన్ని ఆరోపణలనూ అద్వానీ తోసిపుచ్చారు.

ఇక ఈ కేసులో మసీదు కూల్చివేతకు తానేమీ చింతించడం లేదని ఉమాభారతి అన్నారు. కళ్యాణ్ సింగ్ కూడా ఆమెతో ఏకిభవించారు. కాగా  అయోధ్యలో జరిగే  భూమిపూజకు పార్టీలో అత్యంత సీనియర్ నేతలైన అద్వానీ, ఎం ఎం జోషీలకు ఆహ్వానం ఎందుకు వెళ్లలేదన్న అంశం  తీవ్ర చర్చనీయాంశమైంది. మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే కి ఆహ్వానం అందుతుందా లేదా అన్నది  ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఆగస్టు 5 న ప్రధాని మోదీ భూమి పూజలో పాల్గొననున్నసంగతి తెలిసిందే..