UK PM Johnson: భారత్‌కు చేరుకున్న బ్రిటన్ ప్రధాని జాన్సన్.. రేపు ప్రధాని మోడీతో సమావేశం

|

Apr 21, 2022 | 9:36 AM

UK PM Boris Johnson: బ్రిటన్‌ ప్రధానిగా జాన్సన్‌ అధికారం చేపట్టిన అనంతరం మొదటిసారిగా భారత్‌లో (Bharath) పర్యటిస్తున్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ (Boris Jhonson) నేటి నుంచి రెండ్రోజులపాటు..

UK PM Johnson: భారత్‌కు చేరుకున్న బ్రిటన్ ప్రధాని జాన్సన్.. రేపు ప్రధాని మోడీతో సమావేశం
Uk Pm Boris Johnson
Follow us on

UK PM Boris Johnson: బ్రిటన్‌ ప్రధానిగా జాన్సన్‌ అధికారం చేపట్టిన అనంతరం మొదటిసారిగా భారత్‌లో (Bharath) పర్యటిస్తున్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ (Boris Jhonson) నేటి నుంచి రెండ్రోజులపాటు మన దేశంలో పర్యటించనున్నారు. లండన్‌(London) నుంచి నేరుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. కరోనా నేపథ్యంలో బోరిస్‌ ఇప్పటికే పలుమార్లు తన టూర్‌ రద్దు చేసుకున్న జాన్సన్ .. కరోనా ప్రభావం తగ్గడంతో భారత్‌కు రానున్నారు. జాన్సన్‌ తన పర్యటనను అహ్మదాబాద్‌ నుంచి ప్రారంభించనున్నారు. అహ్మదాబాద్‌‌లోని పారిశ్రామిక, వ్యాపారవేత్తలో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా భారత్‌- బ్రిటన్‌ వాణిజ్య, ప్రజా సంబంధాలపై చర్చించనున్నారు. పరిశ్రమల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై, వైద్య, శాస్త్ర రంగాల్లో కలిసి పనిచేయడంపై ప్రకటన చేసే అవకాశం ఉంది. అనంతరం జాన్సన్‌ ఢిల్లీ చేరుకోనున్నారు.

శుక్రవారం ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. రక్షణ విషయాల్లో భాగస్వామ్యం, స్వేచ్ఛా వాణిజ్యం, ఇంధ‌న భ‌ద్రత‌ సహా పలు అంశాలు ఇరు ప్రధానులు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం అంశం కూడా వారి మధ్య ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇరు దేశాల మ‌ధ్య బంధాన్ని ప‌టిష్టం చేసుకోవ‌డం, వ్యూహాత్మక ర‌క్షణ రంగ చ‌ర్యలు, దౌత్య‌, ఆర్థిక భాగ‌స్వామ్యం..వంటి విష‌యాల‌పై ఇరు ప్రధానులు చర్చించనున్నారు.

బోరిస్‌ జాన్సన్‌ గతేడాది రెండుసార్లు భారత పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. గత జనవరిలో రిపబ్లిక్ డే ఉత్సవాలకు ముఖ్య అతిధిగా ఆహ్వానించగా.. యూకేలో కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో తన పర్యటన వాయిదా వేసుకున్నారు.  రెండోసారి.. భారత్ లో కరోనా విజృంభణతో వాయిదా పడింది.  రష్యా, ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని భారత్ పర్యటన పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read: 

Telangana: నగరంలో భానుడు భగభగలు.. ఎల్లో అలర్ట్ జారీ.. మిగిలిన అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన