Clock Tree: దేవుడికి కానుకలుగా గడియారాలు, మొక్కులుగా సిగరెట్లు

మధ్యప్రదేశ్​లోని ఓ గుడిలో దేవుడికి భక్తులు చిత్రంగా పూజలు చేస్తున్నారు. సిగరెట్​ వెలిగించి కోరికలు కోరుతున్నారు. కానుకలుగా గడియారాలు చెల్లిస్తున్నారు. దీంతో ఆ రావి చెట్టు మొత్తం గడియారాలతో నిండిపోయింది. ఈ ఇంట్రస్టింగ్ టెంపుల్ ఎక్కుడంది.. ఆ కథా కమామిషు తెలుసుకుందాం పదండి...

Clock Tree: దేవుడికి కానుకలుగా గడియారాలు, మొక్కులుగా సిగరెట్లు
Ujjain Clock Tree

Updated on: Mar 30, 2025 | 7:13 PM

గుడికి వెళ్లేటప్పుడు ఎవరైనా కొబ్బరి కాయలు, పసుపుకుంకుమ, అగర్బత్తులు, పువ్వులు తీసుకెళ్తారు. ఏదైనా కోరికలు ఉంటే ఆలయం చుట్టూ ప్రదిక్షణలు చేసి కొబ్బరికాయలు కొడతారు. అలాగే దేవుడికి ముడుపులు కట్టి వేడుకుంటారు. కోరికలు తీరిన తరువాత మొక్కలు చెల్లించుకుంటారు. ఇదంతా మనకు తెలిసిందే…! కానీ ఓ చోట మాత్రం వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. దేవుడికి కానుకలుగా గడియాలు, మొక్కులుగా సిగరెట్లు సమర్పిస్తున్నారు. అదెక్కడ అంటారా… ఛలో మధ్యప్రదేశ్‌.

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో ఉన్న సాగస్‌ మహారాజ్‌ ఘడి వాలే బాబా ఆలయం ఉంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు తమ కోరికలు నెరవేరాలని బాబా ముందు సిగరెట్ వెలగిస్తారు. అలా సిగరెట్‌ వెలిగిస్తేనే కోరికలు తీరుతాయని నమ్ముతున్నారు. ఇక ఆ కోరికలు తీరితే గడియారాన్ని బాబాకి సమర్పిస్తున్నారు. అలా భక్తుల గడియాలతో వేల గడియారాలతో నిండిపోయిన ఆలయంలోని మర్రిచెట్టు టిక్ టిక్ అనే శబ్ధంతో మారుమోగిపోతోంది. దీంతో ఈ దేవుడిని గడియారం దేవుడు అని కూడా పిలుస్తారట.

అన్ని ఆలయాల్లో లాగా ఈ ఆలయంలో పూజారులు ఎవ్వరూ ఉండరు. ఎవరికి వారే వచ్చి పూజలు చేసుకుని.. మొక్కులు చెల్లించుకుని వెళ్తుంటారు. ఈ ఆలయం పేరు పెద్దదే అయినా చూడ్డానికి చాలా చిన్నగా ఉంది. ఓ పదేళ్ల క్రితం ఈ ఆలయం వెలుగులోకొచ్చింది. ఇక్కడికి వచ్చి మొక్కుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్మడంతో అనతికాలంలోన ఆలయం ఎంతో ప్రసిద్ది చెందింది.  పౌర్ణమి, ఆదివారం రోజుల్లో సాగస్ మహారాజ్ ఘడి వాలే బాబా టెంపుల్‌కి భక్తులు ఎక్కువగా వస్తారని స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..