
కాలుజారితే వెనక్కు తీసుకోవచ్చు. నోరుజారిందంటే అంతేసంగతులు. పాత సామెతే ఐనా, కొత్తగా వినిపిస్తోంది పొరుగు రాష్ట్రం తమిళనాడులో. సినిమాల్లో మాత్రమే వినిపించే ఒక ముతక డైలాగ్‌ని పబ్లిక్‌లైఫ్‌లో పబ్లిక్ స్పీచ్‌లో వాడి, చినిగి చాటయ్యాక, వెనక్కు తీసుకోలేక నానా తంటాలు పడుతోంది డీఎంకే. అసలే సనాతనంపై అబ్జెక్షనబుల్ కామెంట్లు చేసి రచ్చరచ్చయిన చిన్న స్టాలినే, ఈసారి కూడా ఒక ఇండీసెంట్ కామెంట్‌తో బోనెక్కి నిలబడ్డాడు. సీరియస్ పాలిటిక్స్‌కి కేరాఫ్ అనుకున్న తమిళనాడు, ఫర్ ది ఫస్ట్ టైమ్ సిల్లీ పాలిటిక్స్‌తో మోతెక్కిపోతోంది. ఇక్కడ.. ది మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సనాలిటీ మాత్రం త్రిషాక్రిష్ణన్. సినిమాకీ పాలిటిక్స్‌కి సమానదూరంలో నిలబడ్డ త్రిషకు ఇది హైటైమ్‌గా చెప్పుకోవచ్చు. ఔను.. ఆయనన్న ఆ ఒక్క మాటే.. తమిళనాట మంటలు రేపుతోంది. అపోజిషన్ లీడర్ ఉదయనిధి స్టాలిన్ ఒక్క క్షణం అదుపుతప్పి, నోరుజారి, ఆ వెంటనే కంట్రోల్లోకొచ్చారు. ఏమందామనుకున్నారో ఏమన్నారో ఆయనన్నదాన్నుంచి ఏమని అర్థం వస్తుందో.. ఆయనకే తెలియాలి. కానీ, ఆలోగానే జరగాల్సిందంతా జరిగిపోయింది. కేసులు, FIR, అరెస్టులు, చివరాఖరికి బెయిల్. 24 గంటల్లోనే ఆగమాగమైంది తమిళనాడు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరచడం, విద్వేషాన్ని ప్రోత్సహించడం, అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించడం… ఇలా తీవ్రమైన అభియోగాలతో కేసులు పెట్టి, అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అసలెక్కడ మొదలైందీ రగడ?...